2022

గాంధారి

Gandhari

🎬 Gandhari
🎤 Ananya Bhat🎵 Pawan CH✍️ Suddala Ashok Teja
Advertisement
గాంధారి గాంధారి నీ మరిది గాంధారి దొంగ సందమామ లాగా వంగి చూసిండే
Advertisement

గాంధారి గాంధారి నీ మరిది గాంధారి దొంగ సందమామ లాగా వంగి చూసిండే
గాంధారి గాంధారి నీ మరిది గాంధారి సెంగు సెంగునొచ్చి హోలీ రంగు సల్లిండే
పోయిన ఏడు ఇంత పోకిరి కాడు రైకల వాసనా తెలియనివాడు ఇంతలోపల ఏమి జరిగెను సూదుల సూపుతో గుచ్చుతున్నాడే
గాంధారి నీ మరిది ఏందేందో చేసిండే సింధూరి సెంపాకు సిరి గంధం పూసిండే
గాంధారి నీ మరిది గందరగోళం సందడి మందిలోన ఎట్లా సెప్పమందు వాని అంగాడి
సుందారం బొమ్మనట మందారం రెమ్మనట పిందెలాగా ఉండే లంక బిందె వంటాండే
కందిరీగ నడుమంట కందిపూలు ఒళ్ళంట ఎందుకిట్ల ఎండలోన కందిపోతున్నావని రందిపడి భుజాన కూసుందువు రమ్మంటాండే
గాంధారి గాంధారి నీ మరిది గాంధారి దొంగ సందమామ లాగా వంగి చూసిండే
గాంధారి గాంధారి నీ మరిది గాంధారి సెంగు సెంగునొచ్చి హోలీ రంగు సల్లిండే
బంగారు సీతారామ సింగారు లగ్గానికి సేంగాబి సీర గట్టి మంగళారతి ఇస్తాంటే రంగు జల్లి ఎదురుకోళ్ల రంగు పండగంటాండే పండుగ ఏదైనా రంగు పండుగనే అంటాండే
గాంధారి గాంధారి నీ మరిది గాంధారి దొంగ సందమామ లాగా వంగి చూసిండే
గాంధారి గాంధారి నీ మరిది గాంధారి సెంగు సెంగునొచ్చి హోలీ రంగు సల్లిండే