Advertisement
ఏమైందో గాని చూస్తూ చూస్తూ
చేయిజారి వెళ్ళిపోతోంది మనసిలా
ఏం మాయ వల వేస్తూ చూస్తూ
ఏ దారి లాగుతూ ఉందో తననలా
Advertisement
అదుపులో వుండదే చెలరేగే చిలిపితనం
అటు ఇటూ చూడదే గాలిలో తేలిపోవడం
అనుమతి కోరదే పడి లేచే పెంకితనం
అడిగిన చెప్పదే ఏమిటో అంత అవసరం
ఏం చెయ్యడం మితి మీరే ఆరాటం
తరుముతూ ఉంది ఎందుకిలా
ఏమైందో గాని చూస్తూ చూస్తూ
చేయిజారి వెళ్ళిపోతోంది మనసిలా
తప్పో ఏమో అంటుంది
తప్పదు ఏమో అంటుంది
తడబాటు చేరని నడకా
కోరే తీరం ముందుంది
చేరాలంటే చేరాలి కదా
బెదురుతూ నిలబడకా
సంకేళ్లుగా సందేహం బిగిసాకా
ప్రయాణం కదలదుగా
కలలాగా అలాగే మది
ఉయ్యాల ఊపే భావం
ఏమిటో పోల్చుకోవే త్వరగా
లోలో ఎదో నిప్పుంది
దాంతో ఎదో ఇబ్బంది
పడతావటే తొలి వయసా
ఇన్నాళ్లుగా చెప్పంది
నీతో ఎదో చెప్పింది కదా
అని తెలియదా మనసా
చన్నీళ్లతో చల్లారని కాస్త ఇలా
సంద్రంలో రగిలే జ్వాలా
ఎదో గంట ముద్దు తనకందిస్తే చాలు
అంతే అందిగా అంతేగా తెలుసా
ఏం మాయ వల వేస్తూ చూస్తూ
ఏ దారి లాగుతూ ఉందో తననలా
అదుపులో వుండదే చెలరేగే చిలిపితనం
అటు ఇటూ చూడదే గాలిలో తేలిపోవడం
అనుమతి కోరదే పడి లేచే పెంకితనం
అడిగిన చెప్పదే ఏమిటో అంత అవసరం
ఏమైందో గాని చూస్తూ చూస్తూ
చేయిజారి వెళ్ళిపోతోంది మనసిలా