Advertisement
ఏమైందో ఏమో ఈ వేళా రేగింది గుండెలో కొత్త పిచ్చి
ఎంత వింతో బాడీ ఈ వేళా తూలింది గాలిలో రెక్కలొచ్చి
న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ
తార నగరి కళ్ళ విందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ
Advertisement
ఓలియా ఒయా ఓలియా ఒయా
వెతకాల వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాల
ప్రియురాలే నీ సొంతమైతేయ్ అంత కష్టమనకెలా
ప్రతీకలని చిటికెలతో పిలిచే ప్రణయానా
జాతవలలో ఋతువులనే పట్టే సమయాన
ముల్లోకాలు గుప్పిట్లోనే చిక్కావా
వల్లో తానె స్వర్గం వఛ్చి దిగదా
జనులారా వట్టేసి చెబుతా నమ్ముతారా నా మాట
మనసారా ప్రేమించి చూస్తేయ్ అమృతం అందేనంటా
మిస్ లైలా మిస్సైల స్మైలే విసిరిందా
అది తగిలి కునుకొదిలి మనసే చెదిరిందా
అద్దెయ్ కాదా లవ్ లో లవ్లీ లీల
అయ్యా నేనే ఇంకో మజునూలా
ఏమైందో ఏమో ఈ వేళా రేగింది గుండెలో కొత్త పిచ్చి
ఎంత వింతో బాడీ ఈ వేళా తూలింది గాలిలో రెక్కలొచ్చి
న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ
తార నగరి కళ్ళ విందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ