2001

ఏచోట నేనున్నా

echota nenunna ninnu

🎬 Ninnu Choodalani
ఏచోట నేనున్నా
Advertisement
ఏచోట నేనున్నా నిన్నే తలచుకుంటున్న నీ వెంటే నడిచొస్తుంది నా మనసే ఒట్టేసి చెబుతున్న ఉండలేకపోతున్నా ఒక్కసారి వింటే చాలు నీ పిలుపే
Advertisement

విన్నానులే నీ ఎద సందేశం ఎన్నాళ్లిలా ఒంటరి వనవాసం
ఏచోట నేనున్నా నిన్నే తలచుకుంటున్న నీ వెంటే నడిచొస్తుంది నా మనసే
నాతోటి నేనే మాటాడుకుంటూ ఏటో వెళ్ళిపోతూ ఉంటా నువ్వున్నావంటూ నా నీడ చూసి నే నవ్వుకుంటా హఠాత్తుగా నువ్వొచ్చావో ఏమో అనుకుంటూ
చలి రాత్రి నీకోసం జోల పాడుతూ ఉన్న తెల్లవార్లూ నీ పేరే రాసి అలిసిపోతున్న అదేమిటో దూరంగా వున్నా ప్రతి క్షణం నీతోనే వున్నా
ఏచోట నేనున్నా నిన్నే తలచుకుంటున్న నీ వెంటే నడిచొస్తుంది నా మనసే
నీ పేరు చెబితే రాగాలు తీసే నా ఈడు అల్లరిని నువ్వే వర్ణించాలి నీ జ్ఞాపకాలే నాలోన దాచే నీ ప్రేమ కోసం మల్లి మల్లి పుట్టాలి జాలి లేని ఈ ప్రేమ ఇంత కోత పెడుతుందా చేరువైన మరు నిముషం గాయమంటూ ఉంటుందా
వసంతమే పల్లకి తెస్తుందా తదాస్తాని దీవిస్తానందా
ఏచోట నేనున్నా నిన్నే తలచుకుంటున్న నీ వెంటే నడిచొస్తుంది నా మనసే విన్నానులే నీ ఎద సందేశం ఎన్నాళ్లిలా ఒంటరి వనవాసం
Cast & Crew
🎤SingersHariharanMahalaxmi Iyer
✍️LyricsES Murthy
🎵MusicS.A Rajkumar
HeroJr NTR
💫HeroineRaveena Rajput
🎬DirectorV. R. Prathap