2019

ధన ధన ధన్

dhana dhana dhann

🎬 Mallesham
ధన ధన ధన్
Advertisement
దిం దినక దిం దిం దినక దిం దినక దిం
Advertisement

పల్లె ఒడిలోనా పిల్లల గుడి ఆట రెల్లు పొదలోనా గాలి సయ్యాట పాట పాడేటి పిల్లలు ఊట సెలిమిలో ఆటలాడేటి పిల్లలు మోట గిరకలో పల్లె ఒడిలోనా పిల్లల గుడి ఆట రెల్లు పొదలోనా గాలి సయ్యాట వాగులోనా సేపోలే లేగదూడ గంటోలే ఎయిరా సింధేయరా ఎయిరా సిటీకేయిరా
ధన ధన ధన్ ధన ధన ధన్ ధనకుదనా దరువేయరా జన జన జన్ జన జన జన్ జనక్ జన సిటీకేయిరా ధన ధన ధన్ ధన ధన ధన్ ధనకుదనా దరువేయరా జన జన జన్ జన జన జన్ జనక్ జన సిటీకేయిరా
పగలే వెన్నెలా కాసేటి వాగుల్లోనా కురిసే మువ్వోలె తడిపింది ఝల్లు వానా పూల పుప్పొడులు సిందేసే గాలుల్లోనా ఎగిసే అలవోలె తడిమింది నెమలి ఈక మెరిసే మెత్తని ఇసక పరిసినా ఒడిలోనా పెర్సీనా గులకరాళ్లు గుడిలో తంగేడి వీణ సిట్టి సేతుల పిట్టా గూళ్ళే కట్టినారా పికిలి పిట్టల గూటికి రమ్మని పిలిసినారా ఎలుకా పులి మేకా పిల్లి గద్ద కొడియాటా దాగుడు మూతా దండాకోర్ సిందాటా కప్పా గంతులతోనే తొక్కుడు బిళ్ళాట సుక్కాలా సూరుదాటే సిర్రగోలే ఆటా ఎయిర సిట్టేయ్రా ఎయిర బొట్టెయ్రా
ధన ధన ధన్ ధన ధన ధన్ ధనకుదనా దరువేయరా జన జన జన్ జన జన జన్ జనక్ జన సిటీకేయిరా ధన ధన ధన్ ధన ధన ధన్ ధనకుదనా దరువేయరా జన జన జన్ జన జన జన్ జనక్ జన సిటీకేయిరా
Cast & Crew
🎤SingersAnurag Kulkarni
✍️LyricsGoreti Venkanna
🎵MusicMark K Robin
💫HeroineAnanya Nagalla
🎬DirectorRaj Rachakonda