Advertisement
పచ్చ పచ్చ సెట్టుసేమ
పట్టు సీరేలంటా
Advertisement
నల్ల నల్ల ముళ్లకంప
నల్ల పూసలాంటా
కిచ కిచలాడే ఉడుత
పిచికా లాలిపాటంటా
గలగలా పారె సెలలో నీళ్లు
సలుబాలంటా
అడవి తల్లి ఇంటికొచ్చిన
దగ్గరి సుట్టాలం
వనలచ్చిమి వొడిలో
కట్టాలని గట్టెక్కిచెదం
అడవి తల్లి ఇంటికొచ్చిన
దగ్గరి సుట్టాలం
వనలచ్చిమి వొడిలో
కట్టాలని గట్టెక్కిచెదం
ధామ్ ధామ్ ధామ్ తిరిగేదం
ధామ్ ధామ్ ధామ్ దొర్లేదం
ధామ్ ధామ్ ధామ్ తిరిగేదం
ధామ్ ధామ్ ధామ్ దొర్లేదం
ధామ్ ధామ్ ధామ్ తిరిగేదం
ధామ్ ధామ్ ధామ్ దొర్లేదం
ధామ్ ధామ్ ధామ్ ధామ్
దయ సుపాలని అడవిని అడగేధం
మన పానాలన్నీ నిలిపే తల్లికి
సాగిలపడిపోదం
పొగమంచేమో సాంబ్రానేసి
ప్రేమగా తలని నిమిరేనంటా
సేథీకి తగిలే పేరు బెరడూ
తయాతల్లే తడిమేనంట
మద్దిటెకు ఆకులు మనకు
ఇసనా కర్రలు ఇసిరేనంటా
హాయ్ హాయ్ హాయ్
గడ్డి గరిక పచ్చిక మనకు
పరుపు పరిసి పిలిసినంటా హోం హోం
ధామ్ ధామ్ ధామ్ సుసేధం
ధామ్ ధామ్ ధామ్ సుట్టేదం
ధామ్ ధామ్ ధామ్ ధామ్
అడవే మనకు కోవెల అనుకుందాం
కోరక ముందే వరాలనిచ్చే
తల్లిని కొలిసేధం
సుక్క సుక్క దాచాలంటూ
తేనె తీగె తెలిపేనంటా
సురుకుంటేనే బతుకుందంటూ
దుప్పికడితి సెప్పెనంటా
పెద్దపులితో తలపడు ధైర్నం
అడవిపందే నేర్పేనంటా
కలిసే ఉంటె బలముందంటూ
రేసు కుక్కలు సాటేనంట
పొట్టకూటికి ఏటాడేటి
జీవులు సెప్పే పాఠం ఒకటే
తిన్న ఇంటిని ధ్వంసం సేసే
పాపానికి వోడి కట్టొదంతే
ధామ్ ధామ్ ధామ్ సదివేదం
ధామ్ ధామ్ ధామ్ నేర్సేధామ్
ధామ్ ధామ్ ధామ్ ధామ్
ఈ పాఠాలను బతుకున పాటిదం
అడవిని మించిన బడి లేదంటూ
అడుగులు కదిపేదం