2026

దర్శనమే

darsanamey nari nari naduma

🎬 Nari Nari Naduma Murari
దర్శనమే
Advertisement
దర్శనమే మధురక్షణమే నీవు నేను ఇక మనమే మనసున మోగే మంగళ నాదస్వరమే
Advertisement

నాదాకా నిన్ను నడిపింది ప్రేమే నువ్విల జతగా నడిచే ప్రతి అడుగు పూల వనమే
నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు
నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు
నీ పెదాలకు మెరుపైన ఎరుపు నేనే నీ పాదాలకు సిరి సిరి మువ్వనైన నేనే
నీ నీలి ముంగురుల ఉయ్యాలలూగానే నీ వేలి ఉంగారమై వెయ్యేళ్లు నావేనే
నీ చూపు నేనే నీ రేపు నేనే నీ యదలో కదిలి మెదిలే ఆ సవ్వడైన నేనే
నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు
రాసి ఇవ్వనా నా నవ్వులన్ని నీకే స్వీకరించనా నీ ప్రతి కంటి చెమ్మ నాకే
నా జంట నువ్వుంటే వెన్నెల మధుమాసం నీ తోడు లేకుంటే వేసంగి వనమాసం
నా రామసీతా నా ప్రేమ గీతా నువ్విల జతగా నిలిచీ నా కలలు పండెన్నంటా
దర్శనమే మధురక్షణమే నీవు నేను ఇక మనమే
దర్శనమే మధురక్షణమే మనసున మోగే మంగళ నాదస్వరమే
నాదాకా నిన్ను నడిపింది ప్రేమే నువ్విల జతగా నడిచే ప్రతి అడుగు పూల వనమే
నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు
నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు
Cast & Crew
🎤SingersYazin Nizar
✍️LyricsRamajogayya Sastry
HeroSharwanand
🎬DirectorRam Abbaraju