Advertisement
మబ్బే కమ్మిందా లోకం ఆగిందా
మాతో కాదంటూ చూస్తూ ఉండాలా
దారే లేదా ఆ ఆ ఆ ఆ
గాలే భయమైందా శ్వాసే కరువైందా
యుద్ధం చేస్తున్నా శత్రువు దూరంగా
పోనే పోదా ఆ ఆ ఆ ఆ
Advertisement
మా గొంతే దిగనందే ఓ ముద్దైనా ఈ శోఖంతో
మా కంటిరెప్పేమో నిద్రే పోదే
దేవుళ్ళం అంటారే ఊపిరి పోతే చూస్తూ ఉన్న
ప్రాణాలే కాపాడే వీలే లేదే
చరిత్రలో సమాధులేగా ఇలాంటి ఈ ఉపద్రవాలే
సమిష్టిగా జయించలేవా ఓ హోం ఓ ఓ
కొన్నాళ్ళకి గాథంమీదేగా
ఇదే క్షణం గడుస్తూ పోదా
పోరాడదాం పొయెటి దాకా హోం ఓ ఓ
శోఖం దిగమింగే ఆశే బ్రతికించే
పాడాలి ముగింపు ఏ ఏయే ఏ
ధైర్యాలను నింపే చేద్దాం తెగదెంపే
దూరాలకు పంపే
మా చదువులనే నిలదీస్తుందా
మా అనుభవమే వెలివేస్తుందా
మరి నిర్లక్ష్యం పనికొస్తోందా
ఇది విశ్వాన్నే బలిచేస్తుందా తొలిచేస్తుందా
చరిత్రలో సమాధులేగా ఇలాంటి ఈ ఉపద్రవాలే
సమిష్టిగా జయించలేవా ఓ హోం ఓ ఓ
కొన్నాళ్ళకి గాథంమీదేగా
ఇదే క్షణం గడుస్తూ పోదా
పోరాడదాం పొయెటి దాకా హోం ఓ ఓ
ముందుండే సైన్యం పెడుతుంటే ప్రాణం
చూస్తూ ఉందామా మనమేం చేయలేమా
మాటే విందామా భధ్రంగుందామా
ముసుగే వేద్దామా తరిమే కొడదామా