1995

చిన్ని తండ్రి

Chinni Thandri

🎬 Sisindri
Advertisement
చిన్ని తండ్రి నిను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టేన్తా తగిలేనురా అందుకే అమ్మ వడిలోనే దాగుండిపోరా
Advertisement

చిన్ని తండ్రి నిను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా
ఏ చోట నిమిషం కూడా వుండలేడు చిన్నారి సిసింద్రీల చిందు చూడు పిలిచినా పలకడు వెతికినా దొరకడు
మా మధ్య వెలిసాడు ఆ జాబిలీ ముంగిట్లో నిలిపాడు దీపావళి నిలిచుండాలి కలకాలము ఈ సంబరాలు
చిన్ని తండ్రి నిను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టేన్తా తగిలేనురా
ఆ మువ్వా గోపాలుళ్ళ తిరుగుతుంటే ఆ నవ్వే పిల్లంగ్రోవై మోగుతుంటే మనసులో నందనం విరియాదా ప్రతి క్షణం
మా కంటి వెలుగులే హరివిల్లుగా మా ఇంటి గడపలే రేపల్లెగా మా ఈ చిన్ని రాజ్యానికి యువరాజు వీడు
చందమామ చూసావటోయ్ అచ్చు నీలాంటి మా బాబుని నెల అద్దాన నీబింబమై పారాడుతుంటే చందమామ చూసావటోయ్ అచ్చు నీలాంటి మా బాబుని