Advertisement
చెలి వినమని చెప్పాలి మనసులో తలుపుని
మరి ఇవాళే త్వరపడనా
మరో ముహూర్తం కనబడునా
ఇది ఎపుడో మొదలైందని అది ఇప్పుడే తెలిసిందని
Advertisement
తనక్కూడా ఎంతోకొంత ఇదే భావం ఉండుంటుందా
కనుక్కుంటే బాగుంటుందేమో
అడగ్గానే అవునంటుందా అభిప్రాయం లేదంటుందా
విసుక్కుంటూ పొమ్మంటుందేమో
మందార పువ్వుల కందిపోయి చి అంటే సిగ్గనుకుంటాం కానీ
సందేహం తీరక ముందుకెళితే మరిఎదకెంతో హాని
ఇది ఎపుడో ఇది ఎపుడో మొదలైందని మొదలైందని
అది ఇప్పుడే అది ఇప్పుడే తెలిసిందని తెలిసిందని
పిలుస్తున్న వినపడనట్టు పరాగ్గా నేనున్నానంటూ
చిరాగ్గా చిన్నబోతుందో ఏమో
ప్రపంచంతో పన్లేనట్టు తదేకంగా చూస్తున్నట్టు
రహస్యం కనిపెట్టేస్తుందేమో
అమ్మాయి పేరులో మాయ మైకం ఏ లోకం చూపిస్తుందో గాని
వయ్యారి ఉఊహాలో వాయువేగం మేఘాలు దిగిరానంది
ఇది ఎపుడో ఇది ఎపుడో మొదలైందని మొదలైందని
అది ఇప్పుడే అది ఇప్పుడే తెలిసిందని తెలిసిందని