Advertisement
బంగారు కొండా సడి చేయకుండా
ఎదలోని వెన్న దోచెనే
ఏ చోటునాగే దోబూచులాడి
దరి చేరకుండా కాంచెనే
నీవెక్కడున్న కనిపెట్టలేని కనిపించవేల కృష్ణ
క్రీడలు నీవే లీలలు నీవే మారాలు మాని చేరువ
ఎదలో ఎదో గుబులు ఆయే కృష్ణ
ఎదురై వచ్చి వేదన కానరా కృష్ణ
ప్రాణం నీవే ప్రార్ధన వినర కృష్ణ
మారం మాని దొరికే రారా కృష్ణ
వేణువుడి నా గుండెలోన గిలిగింతలెన్నో పెడతావు ఎలా
వేణు నాధ నా విన్నపాలు విని తరలి రారా త్వరగా
గ రి గ గ రి గ గ రి గ
మా గ మా మా గ మా మా గ మా
స ని రీ స ని రీ స ని రీ స ని రీ
కన్నా కన్నా కన్నా కన్నా
Advertisement