Advertisement
బంగారం నీకోసం నేనుంటా నాకోసం నువుంటే చాలు కదే
నాగుండెల్లో దాపెట్టుకొని కల్లో పెట్టి చూసుకుంటా రాణి వలె
బంగారం నీకోసం నేనుంటా నాకోసం నువుంటే చాలు కదే
నాగుండెల్లో దాపెట్టుకొని కల్లో పెట్టి చూసుకుంటా రాణి వలె
Advertisement
నీ కళ్ళకు కాటుక ఓహో నీ నడుముకి వడ్డాణం ఆహా
ఆ చెవులకి జుంకాలు చేతుల్లో గాజులు ముస్తాబై వొచ్చింది బంగారు బొమ్మ
నీ కాళ్ళకు గజ్జెలు ఓహో లంగా ఓణీలో నడక ఆహా
తిప్పుతున్న చూపులు సొట్ట బుగ్గలు నవ్వుకి పడిపోయా ముద్దులగుమ్మ
కన్నయ్యా నీకోసం నేనుంటా నాకోసం నువుంటే చాలు కదా
నీ గుండెల్లో దాపెట్టుకొ నన్ను తలదాచుకుంటా నీ రాణిలాగా
నువ్వు బుల్లెట్టు బండెకి ఓహో రాజసాబులాగ వస్తే ఆహా
ఆ నల్లకళ్ళ జోడు నల్ల చొక్కా ఏసి డుగ్గుడుగ్గుమని మనసునే దోచావు
ఉంగరాల జుట్టు ఓహో తిప్పుతుంటే నువ్వు మీసం ఆహా
ఆ చేతుకు కడియము వెళ్ళకి ఉంగరాలు చక్కని చుక్కకి నువ్వు చందమామ
నువ్వు ఎన్ని తిట్టుకున్నా నువ్వే కదా అని ఓర్చుకుంటా
ఎన్నిసార్లు కొపడినా సర్లే అని నేను సర్దుకుంటా
బుంగమూతి పెట్టిన ప్రతిసారి క్షమాపణ అడుకుంటా
చిన్ని చిన్ని తప్పులన్నీ పర్లేదని సరిచేసుకుంటా
బంగారం గొడవలెన్నోచ్చినా గుమ్మం దాటకుండా చూసుకుంటా
బుజ్జి తల్లి అడిగింది అందిస్తా కోరింది కొనితెస్తా లోటే లేకుండా
బంగారం నీకోసం నేనుంటా నాకోసం నువుంటే చాలు కదే
నాగుండెల్లో దాపెట్టుకొని కల్లో పెట్టి చూసుకుంటా రాణి వలె