2025

బహుశా బహుశా

bahusa bahusa

🎬 Sundarakanda
బహుశా బహుశా
Advertisement
బహుశా బహుశా బహుశా తరగతి గదిలో ఆగావా ఓ మనసా
Advertisement

బహుశా బహుశా మనసా తిరిగొస్తూనే ఉంటానని నీకలుసా
నీ చెంపలనే కెంపులతో నింపావనుకున్నా బహుశా నువ్వు నచ్చేసా
నీ చెక్కర మాటల్లో నే చిక్కుకుపోయానని తెలుసా నన్నే ఇచ్చేసా
ఎగిరే తారాజువ్వా చూస్తే అది నీ నవ్వా పొగిడే మాటలు ఎన్నున్నా సరిపోవా
కళ్ళతో నవ్వే కలువ ఊహలకందని విలువ ఓ కనికట్టల్లే ఏమ్మాయో చేసావా
మెలకువలో నువ్వే ప్రతి కలలో నువ్వే తమకంలో నువ్వే తీరికనే ఇవ్వవే
మెలకువలో నువ్వే ప్రతి కలలో నువ్వే తమకంలో నువ్వే చివరకి ఎటు చూడు నువ్వే నువ్వే
బహుశా బహుశా బహుశా తరగతి గదిలో ఆగావా ఓ మనసా
బహుశా బహుశా మనసా తిరిగొస్తూనే ఉంటానని నీకలుసా
పలుకుల ధారా గుణగణమే ఔరా నలుగురిలో నడిచే ఓ తారా
తెలిసిన మేరా ఒకటే చెబుతారా ఆలయమే లేని దేవతరా
నీ లక్షణం చెప్పనీ అక్షరాలేమైనా వద్ధింకా నాకోద్ధింకా
ఏ వంకలు పెట్టలేనంతగా నచ్చావే నెలవంక చాల్లే చాలింకా

Cast & Crew