1997

అందాల సీమలోని

Andala Seemaloni

🎬 Gokulamlo Seeta
Advertisement
అందాల సీమలోని పారిజాత పుష్పమ ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమ వరించి నన్ను చేరుమా... సుఖాన ముంచి తేల్చుమా... ప్రియాతి ప్రియతమ ఇదేమి సరిగమ శృంగార వీణ మీటి గోల చేస్తే న్యాయమ
Advertisement

అందాల సీమలోని పారిజాత పుష్పమ ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమ
రా రమ్మంది లేత చెక్కిలి రేపెట్టింది కొత్త ఆకలి సిగ్గు మొగ్గ మేలుకుంది తియ్యగ తేనె ముద్దలారగించు హాయిగ అంత భాగ్యమ పంచ ప్రాణమ ఒడిలో చేరనీయుమా... హో
అందాల సీమలోని పారిజాత పుష్పమ ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమ
లాగించేస్తే ప్రేమ జిలేబి ఏమౌతుందో కన్నే గులాబి పాలపొంగులాంటిదమ్మ కోరిక పైటచాటు దాచుకోకే ప్రేమికా కొంగుజారితే కొంపమునగదా వాటే రిస్కు మన్మథా
అందాల సీమలోని పారిజాత పుష్పమ ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమ వరించి నన్ను చేరుమా... సుఖాన ముంచి తేల్చుమా... ప్రియాతి ప్రియతమ ఇదేమి సరిగమ శృంగార వీణ మీటి గోల చేస్తే న్యాయమ మ్మ్..మ్మ్..మ్మ్...