Advertisement
అమరారామ సుమా రామ చరి కామధేను క్షీరాలతో
సాయినాథ నీ పావన మూర్తికి అభిషేకం క్షీరాభిషేకం
Advertisement
సురకల్పలతా సురభిడ సుమాల సురు చిర సుమధుర మకరందంతో
సాయినాథ నీ మంగళమూర్తి కి అభిషేకం మధురాభిషేకం
మలయ మహీధర శిఖర వనాంతర చందన సుఖ శీతల గంధంతో
సాయినాథ నీ సుందర మూర్తికి అభిషేకం చందనాభిషేకం
శ్రీహరి పద రాజీవ సముద్భవ గగన గంగ పావన శీకరముల
సాయినాథ నీ శ్రీకర మూర్తికి అభిషేకం నీరాభిషేకం
నీ పవహీజసమీపధునీగత ఆదివ్యాధి నిరోధి ఊదితో
నీ పవహీజసమీపధునీగత ఆదివ్యాధి నిరోధి ఊదితో
సాయినాథ నీ తేజోమూర్తికి
అభిషేకం ఊద్యాభిషేకం
జయహో సాయి జయం జయం
నీ పదకమలములకు జయం జయం
జయహో సాయి జయం జయం
నీ పదకమలములకు జయం జయం
జయహో సాయి జయం జయం
నీ పదకమలములకు జయం జయం