2026

అలసేంద్రవంక

Alasendravanka

🎬 Crazy Kalyanam
అలసేంద్రవంక
Advertisement
అందం మురిసే గంధం కురిసే పిల్లా నీ మేని సొగసులనే చూసి వేకువలోనా వెన్నెల కాసి.. పిల్లా నీ పెదవులపై నవ్వై పూసే
Advertisement

నీ అడుగులతోనే అవని పులకించే నీ తనువును తాకా మేఘం తలవంచె సింగిడి రంగులతో పొంగే ఆకాశం నీ ఒంటికి చీరై నిగనిగ మెరిసిందా
ఓ అలసేంద్ర వంకోలే ఉన్నావే పిల్లా ఇలా వాకిలి మెరిసిందే నీ అందం వల్లా ముంగురు కురులా గాలం వేసావే పిల్లా ఊపిరి కుదిపేసావే...
ఓ అలసేంద్ర వంకోలే ఉన్నావే పిల్లా నా మనసే మైమరిసే నీ అందం వల్లా ముంగురు కురులా గాలం వేసావే పిల్లా ఊపిరి కుదిపేసావే...
నీ కోసం నా కనులే రెప్పే వేయక తెరిచి గాలించే నీ చూపే సోకింగా నదిలా నా తనువే ఊయలలూగే
నీతోనే జతగా నడవాలనే ఆశ తొలకరి మొలకోలే చిగురించిందే నా నీడే నీవై ఉండాలని తలచి చూసిన ప్రతిరాయికి నే మొక్కితినే
ఓ అలసేంద్ర వంకోలే ఉన్నావే పిల్లా ఇలా మెరిసి మురిసిందే నీ అందం వల్లా ముంగురు కురులా గాలం వేసావే పిల్లా. ఊపిరి కుదిపేసావే...
ఓ అలసేంద్ర వంకోలే ఉన్నావే పిల్లా నా మనసే మైమరిసే నీ అందం వల్లా ముంగురు కురులా గాలం వేసావే పిల్లా ఊపిరి కుదిపేసావే
ఓ నాయెదనే వాకిలిగా నీ కోసం పరిచి వేచున్నానె వరమోలే నీ రాక నిజమా కలనా అని పులకించానే
వెలిగే దీపముల మదిలో కదిలావే రేయిలో పగలోలే మురిపించావే ఎన్నో ఊహలతో దోసిలినే సాచా చేతుల గీతోలే నన్నెల్లుకుపోవె!...
ఓ అలసేంద్ర వంకోలే ఉన్నావే పిల్లా ఇలా వాకిలి మెరిసిందే నీ అందం వల్లా ముంగురు కురులా గాలం వేసావే పిల్లా ఊపిరి కుదిపేసావే
ఓ అలసేంద్ర వంకోలే ఉన్నావే పిల్లా నా మనసే మైమరిసే నీ అందం వల్లా ముంగురు కురులా గాలం వేసావే పిల్లా ఊపిరి కుదిపేసావే....
Cast & Crew