2020

ఆకాశం నీ హద్ధురా

aakasham nee haddhuraa aakasham nee

🎬 Aakasham Nee Hadhuraa
ఆకాశం నీ హద్ధురా
Advertisement
తానే నననానే నననానే నననానే తానే నననానే నననానే నననానే
Advertisement

నడి గుండెళ్ళో నిప్పుంది మండిచూ దాన్నీ ఆ మంటల్లో వెలిగించు నీ రేపటినీ సుడిగుండాలు ఎదురైనా లెక్కించకు దేన్నీ ఎదురీదాలి చేరాలి లక్ష్యాలనీ
ఒడ్డునా ఉండి రాల్లేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు రత్నంలా నువు తేలిననాడు మూసుకుపోవా వాగిన నోళ్ళు ఒడ్డునా ఉండి రాల్లేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు రత్నంలా నువు తేలిననాడు మూసుకుపోవా వాగిన నోళ్ళు ముక్క చెక్కలుగ విరిచెయ్ నీకెదురుపడిన చిక్కులని ఉక్కు రెక్కలతొ ఎగరెయ్ నిను నమ్ముకున్న నీ కలని
తానే నననానే నననానే నననానే అదిగో ఆకాశం నీ హద్ధురా తానే నననానే నననానే నననానే దాన్నందే అవకాశం వదలొద్దురా ఆఆ
ఇటురా అని చిటికేసావో గెలుపెందుకు దిగి రావాలి నీకూ మరి మిగితా వాళ్ళకి తేడా ఎట్టా తెలియాలి గర్వంగా చెప్పుకునేందుకు నీకూ ఓ కథ కావాలి చెమటోడ్చి పొందినా విజయం పరిమళమై నిను చేరాలి
కన్ను చిన్నగున్నాదంటూ చిన్నా కలలు కంటావా లేనిపోని పేదరికంతో వాటికి గిరి గీస్తావా మట్టిలోకి వెలిపోయావో మళ్ళి పుట్టి వస్తావా ఉన్నాదొక్క జీవితమే ఊరికే వదిలేస్తావా మనసు పెట్టి పనిచేస్తూ ఓర్పుతోనే అడుగేసెయ్ నీదైన మార్పుగా నేడే సరికొత్త చెరితనే రాసెయ్
తన్నే తననానే తననానే నానే నానే తన్నే తననానే తననానే నానే నానే తానే నననానే నననానే నననానే తానే నననానే నననానే నననానే ఆకాశం నీ హద్దురా పదా పదా పదా పద పద పదా పదా పదా పదా పదా పదా పదా పదా
Cast & Crew