2003

ఏ చోట నువ్వున్నా

Ye Chota Nuvvunna

🎬 Johnny
Advertisement
ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా ఆపను
Advertisement

ఏ గాలి వీస్తున్న నీ ఊసే వింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను
ఇన్నాళ్లు పక్కన లేవు కదా అనే మాట గుర్తుకు రాదు కదా
ఇన్నాళ్ల ఒంటరితనమంతా నిన్ను చూసి తప్పుకు పోయిందా
హే ర తరర రారరా హే ర తరర రారరా
పెదవులకెన్నడు తెలియని నవ్వులు పరిచయమయినవి నీ వలన
ఇదివరకెన్నడు కలగని ఆశలు మొదలవుతున్నవి నీ వలన
ఏమైందో ఏమో నిజంగా లోకం మారిందో ఏమో కొత్తగా
ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా ఆపను
ఏ గాలి వీస్తున్న నీ ఊసే వింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను
గీత
హే ర తరర రారరా హే ర తరర రారరా
ఏ నడి రాతిరి నా దరి చేరక కావలి ఉందిగా నీ మమతా
నా ప్రతి ఊపిరి ఆయువు పోయగా వాడదుగా మన ప్రేమలత
నూరేళ్లు నీతో సాగని వెతికే ఆ స్వర్గం మనతో చేరని
ఏ గాలి వీస్తున్న నీ ఊసే వింటున్నా ఏ వింత భావం ఎలా చెప్పను
ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా ఆపను