2000

వెచ్చ వెచ్చగా

Vecha Vechega

🎬 Vamsi
Advertisement
వెచ్చ వెచ్చగా ఉంది చిలిపి కౌగిలి అంబరానికి నేడే ప్రేమ జాబిలి ఊహలకె ఊపిరొచ్చేలే ఊసులకే ఊహ తెలిసెలే ఊరించే ఆశలెన్నొ మధిలో... మనసంతా పరవసించెనే నీకోసం పరితపించెలే నీరూపం నిండివుంది ఎదలో
Advertisement

వెచ్చ వెచ్చగా ఉంది చిలిపి కౌగిలి అంబరానికి నేడే ప్రేమ జాబిలి
నీ మాటల్లో ఏవో సరిగమలు నీ మౌనంలో ఏవో గుసగుసలు నీ కన్నుల్లో రంగుల రాగాలు ఆరాదంలో ఏవో విరహాలు ఓ చెలియా చెంత చేరునా మత్తెక్కె మాయ చేయన నీ పెదవిని పాలకరించిపోనా మురిపించే మాట చెప్పనా కరిగించే కౌగిలివ్వనా ముద్దులనే మూటగట్టి తేనా
వెచ్చ వెచ్చగా ఉంది చిలిపి కౌగిలి అంబరానికి నేడే ప్రేమ జాబిలి
నీ సిరిమువ్వల సవ్వడి నను తాకే ఓ నీ చిరునవ్వుల వల నను బంధించే నా హృదయంలో అలజడి వైనావే ఓ నా శ్వాసకు నువ్ శృతివై నిలిచావే ప్రియురాలా ప్రేమ పంచుకో పరువాల పల్లవందుకో గుండెల్లో నన్ను దాచుకోవే... అధర మాధరాలవెందుకు వయసార పిలిచినందుకు తనువార నన్ను దోచినావే
వెచ్చ వెచ్చగా ఉంది చిలిపి కౌగిలి అంబరానికి నేడే ప్రేమ జాబిలి మనసంతా పరవసించెనే నీకోసం పరితపించెనే నీరూపం నిండివుంది ఎదలో ఊహలకె ఊపిరొచ్చేలే ఊసులకే ఊహ తెలిసెలే ఊరించే ఆశలెన్నొ మధిలో
వెచ్చ వెచ్చగా ఉంది చిలిపి కౌగిలి అంబరానికి నేడే ప్రేమ జాబిలి