2000

తొలి వలపే తీయనిది

tholi valape theeyanidi

🎬 Yuvaraju
Advertisement
తొలి వలపే తీయనిది ఆ దాహం తీరనది కాలంలా కరిగిపోనిది ప్రాణంలా తిరిగిపోదది తొలి వలపే తీయనిది ఆ దాహం తీరనది
Advertisement

వేదంలాగ లిపి లేనిది వేధిస్తున్న సుఖమైనది ఓడిస్తున్న గెలుపే అది ఓదార్చె ఓ పిలుపైనది చుక్కలనె నిలుపునది దిక్కులనె కలుపునది ఆకాశం తానై ఉన్నది
ఒక్కరిలో ఇద్దరది ఇద్దరిలో ఒక్కటది నీకోసం నేనై ఉన్నది తొలి వలపె ఆ బాధే
గుండెల్లో నా గూడె ఇది గుచ్చే రోజామాలే అది మాటల్లో నా మౌనం అది మనసుల్లో నా ధ్యానం అది యే రుణమో తెలియనిది యే వరము అడగనిది యే మజిలి చేరేనో అది
ఎప్పటిదో యెరుగనిది ఎన్నటికి మరువనిది ఓ కధల చేరే కంచికి తొలి వలపె తీయనిది ఆ బాధే తీరనది యెదకన్న లోతుగుంటది బ్రతుకల్లె తోడు ఉంటది