Advertisement
తలదించుకు బతుకుతావు తలెత్తుకు తిరగలేవా
తలరాతను మార్చుకోవా సిగ్గనేది లేదా
ఒకడిగా నువ్వు పుట్టలేదా ఒకడిగా నువ్వు చచ్చిపోవా
ఒకడిగా పోరాడలేవా నిద్రలేచి రారా
నీ ఓటు ని నే వేటుకు వాడుకుంటే వింతగా
జుట్టుపట్టి రచ్చకీడ్చి నిలదీయవ నేరుగా
ఉడుకెత్తిన నెత్తురు ఒక నిప్పుటేరు లాగా కదలి రా
కదలి రా తరలి రా
పనైపోద్ది పనైపోద్ది పనైపోద్ది రారా
Advertisement
నీ ఇంటి చూరు విరిగి మీదపడక ముందే
నీ గుండెల చప్పుడు నిను ఛీకొట్టకముందే
కదల్రా కదల్రా కదల్రా ఒరేయ్
దేహానికి హాని అంటే వైద్యమిచుకోవా
దేశానికీ జబ్బు చేస్తే నీళ్లు నములుతావా
కదల్రా కదల్రా కదల్రా ఒరేయ్
తొలి మనిషేపుడొక్కడేగా తొలి అడుగేపుదొంతరేగా
తొలి పోరుకు సిద్ధమైన తొలి వాడిగా రారా
తెగపట్టిన పిడికిలయ్యి పోటెత్తిన సంద్రం అయ్యి
నడి నెత్తిన సూర్యుడయ్యి ఉద్యమించి లేరా
పోరాడని ప్రాణం ఉంటె అది ప్రాణమే కాదట
ఊపిరిని ఒలకబోసి ఎగరెయ్యరా బావుటా
కణ కణ కణ ప్రతి కణమున
జన గణ మన గీతమయ్యి రా
కదలి రా కదలి రా కదలి రా
పనైపోద్ది పనైపోద్ది పనైపోద్ది రారా