Advertisement
శుభలేఖ రాసుకున్న యెదలో ఎపుడో
అది నీకు పంపుకున్న అపుడే కలలో
పుష్యమి పూవులా పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో
శుభలేఖ అందుకున్న కలయో నిజమో
తోలి ముద్దు జాబు రాసా చెలికె ఎపుడో
శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యను రంగరిస్తా కన్నులతో
శుభ లేఖ రాసుకున్న యెదలో ఎపుడో
తోలి ముద్దు జాబు రాసా చెలికె ఎపుడో
Advertisement
చైత్రమాసమోచెనేమో చిత్రమైన ప్రేమకి
కోయిలమ్మ కూసేనేమో గొంతునిచ్చి కొమ్మకి
మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి
మల్లెమబ్బులాడెనేమో బాల నీలవేణికి
మెచ్చి మెచ్చి చూడసాగె గుచ్చే కన్నులు
గుచి గుచి కౌగిలించే నచ్చే వన్నెలు
అంతేలే కదంతేలే అదంతేలే
శుభలేఖ అందుకున్న కలయో నిజమో
శుభలేఖ రాసుకున్న యెదలో ఎపుడో
పుష్యమి పూవులా పూజ చేస్తా బుగ్గన చుక్కల
ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో
శుభ లేఖ అందుకున్న కలయో నిజమో
శుభలేఖ రాసుకున్న యెదలో ఎపుడో
హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి
ప్రేమలేఖ రాసుకున్న పెదవి రాణి మాటకు
రాధా లాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో
వేసవల్లే వేచి ఉన్న వేగు పూల తోటలో
వాలు చూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు
వొళ్ళో దాటి వెళ్లసాగే ఎన్నో వాంఛలు
అంతేలే కదంతేలే అదంతేలే
శుభలేఖ రాసుకున్న యెదలో ఎపుడో
అది నీకు పంపుకున్న అపుడే కలలో
శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యను రంగరిస్తా కన్నులతో
శుభలేఖ రాసుకున్న యెదలో ఎపుడో
శుభలేఖ అందుకున్న కలయో నిజమో