2013

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

Sitamma Vakitlo Sirimalle Chettu

🎬 Seethamma Vakitlo Sirimalle Chettu
Advertisement
వేకువ లోన గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది వేకువ లోన గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది
Advertisement

పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహ సిగ్గన్త చీర గట్టింది చీర లో చందమామ ఎవ్వరమ్మా ఆ గుమ్మా సీతమ్మా
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో విరగబూసింది కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు కోసినవణ్ణి సీత కొప్పు చుట్టండి కొప్పున పూలు గుప్పె డెందుకండి కోదండ రామయ్య వస్తున్నాడండి రాణే వచ్చాడోయమ్మా ఆ రామయ్య వస్తూ చేశాడమ్మా ఎదో మాయ రాణే వచ్చాడోయమ్మా ఆ రామయ్య వస్తూ చేశాడమ్మా ఎదో మాయ
సీతకి రాముడే సొంతమయే చోటిది నెలతో ఆకాశం వియ్యమొందే వెలిది మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటచేనమ్మా ఊఊ ఏడు అంగలేస్తే ఏడు జన్మలకి వీడదీసిందమ్మా
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చేట్టు సిరిమల్లె చెట్టు పై చిలక వాలింది చిలకమ్మా ముద్దు గ చెప్పిందో మాట ఆ మాట విన్న మా రామ అంటుంది రామ రామ అన్నది ఆ సీత గుండె అన్ననాడే ఆమెకి మొగుడయ్యాడే
చేతిలో చేతులే చేరుకుంటే సంబరం చూపులో చూపులే లీనమైతే సుందరం జంట బాగుందంటూ గొంతు విప్పాయంట చుట్టూ చెట్టు చేమ పంట పండిందంటూ పొంగిపోయిందమ్మా ఇదిగో ఈ సీతమ్మ