2025

సయ్యారే

🎬 Mowgli
Advertisement
తీర తారే తారే తారే తనేనా తన్నానే తీర తారే తారే తారే తనేనా తన్నానే
Advertisement

ఓ నువ్వు చెప్పని మాట మనసారా వింటున్నా నువ్వు పాడని పాట నీకే వినిపించైనా మాటిదని అలవాటిదని అననా అననా
సయ్యారే సరికొత్త లోకంలోకి సయ్యారే సరదాలకి సయ్యారే చిరుగాలి గుర్రం ఎక్కి సయ్యారే సవ్వారికి సయ్యారే చిరునవ్వుల చేతికి చిక్కి సయ్యారే నూరేళ్లకి
సయ్యారే సరికొత్త లోకంలోకి సయ్యారే సరదాలకి
ఏ భాషంటూ లేనే లేని జగానా ఉందామే ఏ బాధంటూ రానే రాని స్థలానా ఉందామే
ఎన్నెన్నో ఉన్నాయంట చూపులు ఇంకెన్నో ఉన్నాయంట సైగలు చూపుల్లో సందేశాలు సైగల్లో సంభాషణలు సరిపోవా
వద్దంట నీకు నాకు మాటలు రాద్దంట ఇద్దరి మధ్య లు నా గుండె చప్పుడు నీకు నీ గుండె చప్పుడు నాకు సరిపోదా
చందమామ వెలిగిస్తుంది ఏసడి లేక సవ్వడి లేక అలజడి లేక నిండు ప్రేమ వెలికొస్తుంది ఏకాంతంగా నిస్వార్ధంగా నిశబ్దంగా
పువ్వుల్లోనా ధ్వని ఉంటుందా రంగులోనా ధ్వని ఉంటుందా శ్వాసలోనా ధ్వని ఉంటుందా ప్రాణంలోనా ధ్వని ఉంటుందా ప్రేమాల్లోనా ఈ శబ్దకలుషాల అవసరముందా
సయ్యారే సరికొత్త లోకంలోకి సయ్యారే సరదాలకి సయ్యారే చిరుగాలి గుర్రం ఎక్కి సయ్యారే సవ్వారికి సయ్యారే చిరునవ్వుల చేతికి చిక్కి సయ్యారే నూరేళ్లకి
సయ్యారే సరికొత్త లోకంలోకి సయ్యారే సరదాలకి సయ్యారే హో హో సరదాలకి సయ్యారేఓ హో హో