2026

సర్పంచి కూతురా

🎬 SARPANCH KUTHURU
Advertisement
ఓ లీలమ్మ ఏడున్నాడు నీ కొడుకు ఇయ్యాల రేపు ఏడ కనిపిస్తలేడుఏంది పోరాడు ఎప్పుడు చూసినా నీ అంటేనే ఎదురుగుతుంటాడు కదా ఏందే ఏం చెప్తలేవు ఏమనా అయిందా ఏంది
Advertisement

ఓ సర్పంచి కూతురా సర్పంచి కూతురా నిన్నుడిసి నేనుండలేనే నిన్నెక్కించి తిప్పుతా ఎక్కించి దిప్పుతా నేనే కొన్న కొత్త బైకు పైనే
ఓ సర్పంచి కూతురా సర్పంచి కూతురా నిన్నడిచి నేను ఉండలేనే నిన్నెక్కించి దిప్పుతా ఎక్కించి దిప్పుతా నేకొన్న కొత్త బైకు పైనే
కోడి కూత కంటే ముందు కప్పులోన చాయి పోసి చెప్పకుండా చేతికిత్తనే కూర నువ్వు వండుతుంటే చెయ్యి నీకు నొయ్యకుండ గంటె నేను దిప్పుతాంటనే పానమాడుతుంటే నువ్వు తడకలాగా నేను ఉండి అందమంతా తాగుతుంటనే ఒంటి మీద నీటి ఒట్టు ఆవిరయ్యేటట్లు నేను దుండుతోటి తుడిచి వెడదనే
ఓ సర్పంచి కూతురా సర్పంచి కూతురా నిన్నుడిసి నేనుండలేనే నిన్నెక్కించి తిప్పుతా ఎక్కించి దిప్పుతా నేనే కొన్న కొత్త బైకు పైనే
రావి చెట్టు చుట్టు నువ్వు దండమెట్టి తిరుగుతాంటే కాళ్ళ కింద బొంతలేస్తానే చిలకమాడ నువ్వు పోతే చేప కంపుపొట్టకుండా చెరువులోన సెంటు పోస్తనే
స్టీలు కంచమైతే నీకు అంచు తగిలినొస్తదాని పూల ఇస్తరాకులేస్తనే యాటకూరలోన గట్టి బుక్కలన్నీపక్కనెట్టి మెత్తదంత నోట్ల పెడతనే
ఓ సర్పంచి కూతురా సర్పంచి కూతురా నిన్నుడిసి నేనుండలేనే నిన్నెక్కించి తిప్పుతా ఎక్కించి దిప్పుతా నేనే కొన్న కొత్త బైకు పైనే
ఊరిలో కరెంటు పోతే ఉక్క నీకు వస్తదాని ఫ్యాన్ రెక్క దిప్పుతంటనే ముంగిలంతా సల్లు కొట్టి సర్ది నీకు చేస్తదాని అంగి ఇప్పి గొడుగు పడతనే సుస్తి నీకు చేశనంటే సేదుకొని డాక్టర్లు ఇస్తే దాని మీద తేన ఊస్తనే సూది మందు నీకు వేస్తే సురుగు సురుకు మంటదాని సూది నాకు గుచ్చుమంటనే
ఓ సర్పంచి కూతురా సర్పంచి కూతురా నిన్నుడిసి నేనుండలేనే నిన్నెక్కించి తిప్పుతా ఎక్కించి దిప్పుతా నేనే కొన్న కొత్త బైకు పైనే
అది నా పెల్లం సర్పంచ్ కూతురు నరసింహ స్వామి గుళ్ళ ధూం దామగా పెళ్లి చేసుకున్నా దాన్ని పువ్వుల పెట్టి చూసుకున్నా నెత్తిల పెట్టి చూసుకున్నా దాని మీద ఎవని కన్ను పడినా దాని కంట్లకెళ్లి నీరవచ్చినా బిడ్డ ఒక్కొక్కని పొట్టు పొట్టు ట్టు లేపి లేపి కొడతా చూడు బొక్క లిరగొట్టి బొంద పెడతా