Advertisement
సరిహద్దున్న నువ్వు లేకుంటే
ఏ కన్ను పాప కంటి నిండుగా
నిధ్రపోదురా నిధ్రపోదురా
Advertisement
నిలువెత్తున నిప్పు కాంచేవై
నువ్వుంటేనే జాతి బావుటా
ఎగురుతుందిరా పైకెగురుతుందిరా
ఇల్లే ఇండియా ఢిల్లీ ఇండియా నే తల్లే ఇండియా
తన భరోసా నువ్వే దేశం కొడకా
సెలవే లేని సేవాకా ఓ సైనికా
పనిలో పరుగే తీరికా ఓ సైనిక
ప్రాణం అంత తేలికా ఓ సైనికా
పోరాటం నీకో వేడుకగా ఓ సైనిక
దేహంతో వెళిపోదీ కథ
దేశంలా మిగిలుంటుందిగా
సమరం ఒడిలో నీ మరణం
సమయం తలచే సంస్మరణం
చరితగా చదివే తరములకు
నువ్వో స్ఫూర్తి సంతకం
పస్తులు లెక్కపెట్టవే ఓ సైనికా
పుస్తెలు లక్ష్యపెట్టవే ఓ సైనిక
గస్తీ దుస్తుల సాక్షిగా ఓ సైనికా
ప్రతి పూటా నీకో పుట్టుకే ఓ సైనిక
బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు
ఏ పని తెలియదు అని నీ అడుగుతూ పడలేదు
తెగవాగు ధీరుడివని బలమగు భక్తుడనే
వేలెత్తి ఎలుగెత్తి భూమి పిల్చింది
నీ శక్తిని నమ్మి
ఇల్లే ఇండియా ఢిల్లీ ఇండియా
ఇల్లే ఇండియా ఢిల్లీ ఇండియా నీ తల్లే ఇండియా
తన భరోసా నువ్వే దేశం కొడకా
నువ్వో మండే భాస్వరం ఓ సైనికా
జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనిక
బతుకే వందేమాతరం ఓ సైనికా
నీ వల్లే ఉన్నాం అందరం ఓ సైనిక