Advertisement
సాహసం శ్వాసగా
సాగిపో సోదరా
సాగరం ఈదటం
తేలికేం కాదురా
Advertisement
ఏ కోవెలో చేరాలని
కలగన్న పూబాలకి
సుడిగాలిలో సావాసమై
దొరికింది ఈ పల్లకి
ఈ ఒక్కడు నీ సైన్యమై
తోడుంటే చాలు
సాహసం శ్వాసగా
సాగిపో సోదరా
సాగరం ఈదటం
తేలికేం కాదురా
కాలానికే తెలియాలిగా
ముందున్న మలుపేమిటో
పోరాటమే తేల్చాలిగా
రానున్న గెలుపెవరిదో
ఈ ఒక్కడు నీ సైన్యమై
తోడుంటే చాలు
సాహసం శ్వాసగా
సాగిపో సోదరా
సాగరం ఈదటం
తేలికేం కాదురా