2015

రామ రామ

Rama Rama

🎬 Srimanthudu
Advertisement
హే సూర్య వంశ తేజమున్నా సుందరాంగుడు పున్నమి చంద్రుడు మా రాజైనా మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తినా మహానుభావుడు వాడే శ్రీ రాముడు
Advertisement

హే రాములోడు వచ్చి నాడురో దాని తస్సదియ శివ ధనుసు ఎత్తినాడురో దాని తస్సదియ శివ ధనుసు ఎత్తినాడురో నారి పట్టి లాగినాడురో దాని తస్సదియ నింగి కెక్కు పెట్టి నాడురో దాని తస్సదియ నింగి కెక్కు పెట్టి నాడురో పెళ పెళ పేలు మంటూ ఆకాశాలు కూలినట్టు బల బల బలుమంటూ దిక్కులన్నీ పేలినట్టు విల విలమంటూ విల్లు విరిచి జనక రాజు అల్లుడయ్యారో
మా రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగా అందరొక్కటవుదామా మా రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగా అందరొక్కటవుదామా
హే రాజ్యమంటే లెక్కలేదురో దాని తస్సదియ అడవు బాట పట్టినాడురో హే పువ్వులాంటి సక్కనోడురో దాని తస్సదియ సౌక్యమంతా పక్కనెట్టారో హే బలే బలే మంచిగున్నా బతుకునంతా పానం పెట్టి ఆలు మలుపుల గతుకులున్నా మూళ్ళ దారిపట్టి తన కథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడురో
మా రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగా అందరొక్కటవుదామా మా రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగా అందరొక్కటవుదామా
రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ హే రామ సక్కనోడు మా రామ సంద్రుడనట్ట ఆడకల్లు తాకి కందిపోతాడంట అందగాళ్ళకే గొప్ప అందగాడంట నింగి నీలమై ఎవరికీ చేతికందంట
హే జీవుడల్లే పుట్టినాడురో దాని తస్సదియ దేవుడల్లే ఎదిగినాడురో దాని తస్సదియ దేవుడల్లే ఎదిగినాడురో హే నెలదారి నడిచినాడురో దాని తస్సదియ పూల పూజలందినడురో దాని తస్సదియ పూల పూజలందినడురో హే పదపదమని వంతెనేసి వెనుకడలి దాటినాడు పదిపది తలలు ఉన్నవాడిని పట్టి తాట తీసినాడు చేదు తలపుకి చావుదెబ తప్పదంటూ చూపినాడురో
మా రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగా అందరొక్కటవుదామా మా రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగా అందరొక్కటవుదామా