2026Buchi Babu Sana

రయ్ రయ్ రా రా

Peddi

A.R. Rahman

Advertisement
రయ్ రయ్ రా రా రయ్ రయ్ రా రా అడ్డే లేని దారై రా రా
Advertisement
రయ్ రయ్ రా రా రయ్ రయ్ రా రా హద్దే లేని తీరై రా రా
దూకేట్టి జోరై రా పోరాడేట్టి పోరై రా నీలో ఆరు నూరై రా మందళ్లొంచి వేరై రా
భయ్యం పీకి పారేయ్ రా సిగ్గుంటే సీరై రా జై కొట్టేటి పేరై రా నీ రాక చూసి లోకం చేసే హోరై హోరై హోరై రా రా
రయ్ రయ్ రా రా రయ్ రయ్ రా రా అడ్డే లేని దారై రా రా
రయ్ రయ్ రా రా రయ్ రయ్ రా రా హద్దే లేని తీరై రా రా రా
బెరుగ్గా ఆ బెరుగ్గా ఇరుగ్గా ఆ ఇరుగ్గా పాతేసుకోకోయలా నువ్ నిన్నే నీ లోపలా
హే పాతికేళ్లకే నువ్వు పాతబడిపోకురా
నిన్నటి లాగే రేపున్నదంటే ఈ రోజేం పీకావనే
నీ అయ్య వడ్డి నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే
మొండెంలో తల దించేటట్టైతే హే మొలతాడు ఎందుకు కట్టావ్ తెంచేసెయ్ నువ్వు మొత్తం రత్తం మార్చుకొనొచ్చేసెయ్
రయ్ రయ్ రా రా రయ్ రయ్ రా రా అడ్డే లేని దారై రా రా
ఆటనుకోకోయ్ ఆటంటే బతుకోయ్ నీ ఆట బతకాలిరోయ్
మాటనుకోకోయ్ గెలుపంటే వెలుగోయ్ గెలుపై నువ్వెలగాలిరోయ్
మండే గుండె నీలో లేదంటే కాలు చేయి ఉన్నా లేనట్టే నీకే నెగ్గే నైజం అర్థం కానట్టే