2014

రా రాకుమారా

Ra Rakumaara

🎬 Govindudu Andarivadele
Advertisement
రా రాకుమారా రాజసాన ఏలగా యెదపై చేరనీరా పూలమాలే నేనుగా నీవు తీసే శ్వాసలో ఊయలూగే ఆశతో పంపుతున్నా నా ప్రాణాన్నే నీ వైపుగా
Advertisement

నీ తలపులతో మరిగిపోయే ఒంటరితనము ఇష్టమే నీ కబురులతో కరిగిపోయే ప్రతి ఒక క్షణము ఇష్టమే కలలే నిజమయేలా కళ్ళు తెరిచిన కోరిక ఇష్టం నిజమే కల అయేలా ఒళ్ళు మరచిన అయోమయం మరింత ఇష్టం రా రా రాకుమారా రాజసాన ఏలగా యెదపై చేరనీరా పూలమాలే నేనుగా
బరువనిపించే బిడియమంతా నీ చేతులలో వాలనీ బతకడమంటే ఎంత మధురం నీ చేతులలో తెలియనీ నేనేం చేసుకోను నీకు పంచని ఈ హృదయాన్ని ఇంకేం కోరుకోను నిన్ను మించిన మరో వరం ఏదైన గానీ