Advertisement
పిల్ల గాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి
నల్లమబ్బు ఉరిమెన
పిల్ల గాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి
నల్లమబ్బు ఉరిమెన
కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా
Advertisement
ఎల్లలన్ని కరిగి జల్లుమంటూ ఉరికి
మా కళ్ళలో వాకిళ్ళలో
వేవేల వర్ణాల వయ్యారి జానా
అందమైన సిరివాన
ముచ్చటగా మెరిసే సమయాన
అందరాని చంద్రుడైనా
మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా
మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా
గారంగా పిలిచేనా
జల్లు మంటూ గుండెలోన తుంటరిగా
తుళ్లుతున్న తిల్లానా
మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా
గారంగా పిలిచేనా
జల్లు మంటూ గుండెలోన తుంటరిగా
తుళ్లుతున్న తిల్లానా
ఇంద్ర జాలమై
వినోదాల సుడిలో
కాలాన్ని కరిగించగా
చంద్ర జాలమై తరంగాల వొడిలో
ఎల్లని మురిపించగా
తారాలన్నీ తోరణాలై
వారాల ముత్యాల హారాలయ్యేనా
చందనాలు చిలికేనా
ముంగిలిలో నందనాలు విరిసేనా
అందరాని చంద్రుడైనా
మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా
నవ్వుల్లో హాయి రాగం
మువ్వల్లో వాయు వేగం
ఏమైందో ఇంత కాలం
ఇంతమంది బృంద గానం
ఇవ్వాలె పంపేనేమో ఆహ్వానం
నవ్వుల్లో హాయి రాగం
మువ్వల్లో వాయు వేగం
ఏమైందో ఇంత కాలం
ఇంతమంది బృంద గానం
ఇవ్వాలె పంపేనేమో ఆహ్వానం
పాల వెల్లిగా సంతోషాలు చిలికే
సరదా సరాగాలుగా
స్వాతి జల్లుగా స్వరాలెన్నో పలికే
సరికొత్త రాగాలుగా
నింగి దాకా పొంగి పొగ
హోరెత్తి పోతున్న గానా బజానా
చెంగు మంటూ ఆడేనా
చిత్రంగా జావళీలు పాడేన
అందరాని చంద్రుడైనా
మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా