Advertisement
ఎగసిపడే కెరటాన్నే
ఆపేనా ఎవడైనా
మెరిసిపడే పిడుగులనే
ఆపేనా ఎవడైనా
Advertisement
చదరంగంలో చాణక్యుడికే
ఓటమి ఉందా ఏనాడైనా
ఎదురడుగేసే ఆలోచనకే
వెనకడుగుందా ఎన్నటికైనా
సుడిగాలిని కోసి దారిని తీసి దూకెయ్ బాణంలా
ఫిర్ షురూ చల్ గురు
ఫిర్ షురూ చల్ గురు
వెలుగక్కడ లేదని చెప్పే
మాటేరా చీకటి అంటే
నిశి అన్నది లేనేలేదే
ఆరాటం తోడై ఉంటే
పోరాటం మరి నీ వెంటే
ఓటమికే చోటే లేదే
చినుకుల నడుమన తడవక సాగే
అర్జున వేగం క్షణమాగేనా
నిలబడి పోరే నిలకడ తీరే గెలుపని చాటేలా
ఫిర్ షురూ చల్ గురు
ఫిర్ షురూ చల్ గురు
మిణుగురు పురుగులు అణువంతైనా
అడవిని సైతం వెలిగించెయవా
చలి చీమలు చిరు చిగురంతైనా
వనసర్పమునే గెలిచెయవా
చుక్కలు రేణువులంతే ఉన్నా
నింగిన రంగులు పొంగించెయవా
రెక్కలు ఇంతే పిసరంతైనా
దిక్కులనే శాసించెయవా
కొమ్మల చాటున కోయిల పాటే
వేకువ బాటకు పిలుపే కాదా
నీ పిడికిలిలోని అలికిడి జగతికి మెలకువ పాఠంలా
ఫిర్ షురూ చల్ గురు
ఫిర్ షురూ చల్ గురు
ఫిర్ షురూ చల్ గురు
ఫిర్ షురూ చల్ గురు