2003

ఒక తోటలో

Oka Thotalo

🎬 Gangotri
Advertisement
ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహరాణిలా మహలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని... అలాగే నవ్వుతూ ఉండాలని నింగినేల వాగువంక చెట్టుచేమ గువ్వగూడు ఆశీర్వదించాలి
Advertisement

లల లాలాల లల లాలాల లాలాల లాలాల ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహరాణిలా మహలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది
ఎన్నో రంగుల పువ్వు ఎండ కన్నే ఎరగని పువ్వు సుందరమైన పువ్వు పలు సుగుణాలున్న పువ్వు ఏ గుడిలో అడుగుపెట్టునో... దేవుడు చల్లగ చూడాలి... ఆ పువ్వుకు పూజలు చేయాలి... దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే... హాయిగ ఉండాలి
లల లాలాల లల లాలాల లాలాల లాలాల ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది
నీరును పోసి పెంచి పందిరల్లే నీడనిచ్చి ఎండా వానల్లోనా ఆదరించే తోటమాలి ఆ పువ్వుకి తోడు ఉండగా... దేవుడు వేరే లేడు కదా తోటమాలే పువ్వుకి దేవుడుగా మాలికి పువ్వుకు మధ్యన అనుబంధం... ఎన్నడు వాడదుగా
ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహరాణిలా మహలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని నింగినేల వాగువంక చెట్టుచేమ గువ్వగూడు ఆశీర్వదించాలి
లల లాలాల లల లాలాల లాలాల లాలాల ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహరాణిలా మహలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది