2014

ఓ సయొనారా సయొనారా

O Sayonara Sayonara

🎬 1: Nenokkadine
Advertisement
చెలి చెలి చెలియా చెదిరిన కలయ నువ్వు పలకని మాట లాగ నను మార్చమాకే సఖియా ఓ చెలి చెలి చెలియా చెదిరిన కలయ నువ్వు చూడని చోటు లాగ నను చేయమాకే సఖియా అలై నువ్వే నను వీడినవే నన్నే సంద్రం నేనై ఇలా రానా నీ చుట్టూ నిలవన ప్రాణాల వళై ఓ సయొనారా సయొనారా సయొనారా సెలవంటూ నా చెలిమికే విసరకే చీకటి తెర
Advertisement

చెలి చెలి చెలియా చెదిరిన కలయ నువ్వు పలకని మాట లాగ నను మార్చమాకే సఖియా ఓ ఓ ఓ
హ్మ్మ్ నీతో ఎన్నడూ వచ్చే నీడనై నిఘా నేనేగా నువ్వు ఎప్పుడూ శ్వాసించే గాలినై నిఘా నేనేగా ఓ పువ్వు లాగ నిన్ను చూడాలంటూ ముల్లై పోతా ముత్యం లాగా నిన్ను దాచే ఉప్పు నీరై పోతా ఆపదొచ్చి నిన్ను గుచ్చుకుంటే ఆపే మొదటి గాయం నేనే అవుత ఓ సయొనారా సయొనారా సయొనారా సెలవంటూ నా చెలిమికే విసరకే చీకటి తేరా
నిశ్శబ్దం లోన నీ గుండె చప్పుడై ఉంటా తోడుంటా స్వప్నాలెన్నున్నా నీ రెప్పలా చప్పుడే వింటా నీ వింటా ఓ చేదు కళలు మెలకువ లాగ వస్తా బాధ మేలుకుంటే నిదరై కాపు కాస్త వేదనాలకింకా వీడుకోలు పలికే చివరి కన్నీటి చుక్కై పోతా ఓ సయొనారా సయొనారా సయొనారా సెలవంటూ నా చెలిమికే విసరకే చీకటి తేరా