2025

నువ్వుంటే చాలే

🎬 Andhra King Taluka
Advertisement
ఒక చూపుతో నాలోనే పుట్టిందే ఏదో వింతగా గుండెలో చేరిందే నువ్వెవరో నాలో అని అడిగానే తానేగా ప్రేమని తెలిపిందే
Advertisement

పరిచయం లేదని అడిగా ప్రేమంటే కలిసాంగా ఇకపై మనమేగా అందే వెతికిన దొరకని అర్థం ప్రేమదే అది నీకేంటో ఒక మాటలో చెప్పాలే
నువ్వుంటే చాలే
నువ్వుంటే చాలే నువ్వుంటే చాలే
మాటలతో చెప్పమంటే చెప్పలేనే భావమేదో భాషలకే అందనందే అదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వుంటే
అడిగితే అదేమిటో అర్ధంకాదే నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదే పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే
దారేలేని ఊరినే అడిగానుగా నువ్వేగా దారని నాకు చూపుతుంది కమ్ముకున్న మబ్బులో వెతికానుగా అరె గాలి వానై నన్ను తాకుతుంది
నాకే తెలియని నాలో యుద్ధమా లోలోన సంద్రమా లేదే పొంగుతున్నదే ఇంకేదో పేరు లేదుగా ఇంతే మాట రాదుగా అంతే ఒప్పుకోమరి వింతేలే
నువ్వుంటే చాలే
మాటలతో చెప్పమంటే చెప్పలేనే భావమేదో భాషలకే అందనందే అదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వుంటే
అడిగితే అదేమిటో అర్ధంకాదే నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదే పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే ఓ ఓ ఓ ఓ నువ్వుంటే చాలే ఓ ఓ ఓ ఓ నువ్వుంటే చాలే
నువ్వుంటే చాలే