Advertisement
నువ్వేం మాయ చేసావో గాని
ఇలా ఈ క్షణం ఆగిపోనీ
నువ్వేం మాయ చేసావో గాని
ఇలా ఈ క్షణం ఆగిపోనీ
Advertisement
హాయిరే హాయిరే హాయ్ ఎందని
రేయి చాటు రాగం విని
ఎవరు తనని పిలిచారని
అడిగి చూడు నీ మనసుని
హే కాలాన్నే కదలనీయని
కనికట్టేం జరగలేదని
ఈ తీయని మాయ తనదని
తెలుసా అని
మనసు నీదే మహిమ నీదే
పిలుపు నీదే బదులు నీదే
నువ్వేం మాయ చేసావో గాని
ఇలా ఈ క్షణం ఆగిపోనీ
నువ్వేం మాయ చేసావో గాని
ఇలా ఈ క్షణం ఆగిపోనీ
మూగ మనసిది ఎంత గడుసిది
నంగనాచి సంగతులెన్నో వాగుతున్నది
ఓహో ఇంత కాలము కంటి పాపలో
కొలువున్న కల నువ్వే అంటున్నది
హాయిరే హాయిరే హాయ్ ఎందని
రేయి చాటు రాగం విని
ఎందుకులికి పడుతోందని
అడిగి చూడు నీ మనసుని
హే నిదురించే నీలి కళ్ళలో
కల ఎప్పుడు మేలుకున్నదో
ఆ కల ఏం వెతుకుతున్నదో
తెలుసా అని
కనులు నీవే కళలు నీవే
పిలుపు నీదే బదులు నీదే
నువ్వేం మాయ చేసావో గాని
ఇలా ఈ క్షణం ఆగిపోనీ
నువ్వేం మాయ చేసావో గాని
ఇలా ఈ క్షణం ఆగిపోనీ
పిచ్చి మనసిది ఆ ఎంత పిరికిది
నచ్చుతానో లేదో నీకు అడగమన్నది
ఓహో ఆశ ఆగక అడుగు సాగక
అలలాగ ఎగిరెగిరి పడుతున్నది
హాయిరే హాయిరే హాయ్ ఎందని
రేయి చాటు రాగం విని
గాలి పరుగు ఎటువైపని
అడిగి చూడు నీ మనసుని
హే ఏ దారిన సాగుతున్నదో
ఏ మజిలీ చేరుకున్నదో
ఏ తీరం కోరుతున్నదో
తెలుసా అని
పదము నీదే పరుగు నీదే
పిలుపు నీదే బదులు నీదే
నువ్వేం మాయ చేసావో గాని
ఇలా ఈ క్షణం ఆగిపోనీ
నువ్వేం మాయ చేసావో గాని