Advertisement
నువ్వేం మాయ చేసావోగాని
ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది వోణి
మరీ చిలిపిదీ వయసు బాణీ
Advertisement
హయ్య హయ్యారే హయ్యారే హయ్యా
చిందులేస్తున్న ఈ అల్లరి
ఓ సయ్య సయ్యారే సయ్యారే సయ్యా
ఎటు పోతుందో ఏమో మరి
నువ్వేం మాయ చేసావోగాని
ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది వోణి
మరీ చిలిపిదీ వయసు బాణీ
ఔరా పంచ కళ్యాణి పైనా
వస్తాడంట యువరాజు అవునా
నువ్వేమైన చూసావా మైనా
తెస్తున్నాడా ముత్యాల మేనా
హయ్య హయ్యారే హయ్యారే హయ్యా
మొగలి పువ్వంటి మొగుడెవ్వరే
ఓ సయ్య సయ్యారే సయ్యారే సయ్యా
మేళ తాళాల మనువెప్పుడే
ఔరా పంచ కళ్యాణి పైనా
వస్తాడంట యువరాజు అవునా
నువ్వేమైన చూసావా మైనా
తెస్తున్నాడా ముత్యాల మేనా
కలా నువ్వు ఏ చాటునున్నా
అలా ఎంత కవ్వించుతున్నా
ఇలా నిన్ను వెంటాడి రానా
ఎలాగైన నిను కలుసుకోనా
హయ్య హయ్యారే హయ్యారే హయ్యా
ఆశ పడుతున్న ఈ నా మది
ఓ సయ్య సయ్యారే సయ్యారే సయ్యా
అది తీరేది ఎపుడన్నది
నువ్వేం మాయ చేసావోగాని
ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది వోణి
మరీ చిలిపిదీ వయసు బాణీ