2014

నీలి రంగు చీరలోన

Neeli Rangu Cheeralona

🎬 Govindudu Andarivadele
Advertisement
తానన నననా తనాన తననన నననా తానన నననా తనాన తననన నననా తననాన నననా తాన నననా తాన నననననా నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగుల్లున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టా అదుముకోనే హేహేహే ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కవ్విస్తావే అంతలోనే జారిపోతావే మెరుపల్లె మెరిసి జాణ వరదల్లె ముంచె జాణా ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడె జాణా జాణ అంటే జీవితం జీవితమే నెరజాణరా దానితో సయ్యాడరా యేటికి ఎదురీదరా
Advertisement

రాక రాక నీకై వచ్చి పొన్నమంటి చిన్నది ఇచ్చే కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో పూవు లాగ ఎదురే వచ్చి ముల్లు లాగ ఎదలో గుచ్చి మాయమయే భామ వంటిదె కష్టమనుకో ఎదీ కడదాక రాదని తెలుపుతుంది నీ జీవితం నీతో నువు అతిథివనుకొని వెయ్ రా అడుగెయ్ రా వెయ్ జాణ కాని జాణరా జీవితమే నెరజాణరా జీవితం ఒక వింత రా ఆడుకుంటె పూబంతి రా
సాహసాన పొలమే దున్ని పంట తీసె బలమే ఉంటే ప్రతి రోజు ఒక సంక్రాంతి అవుతుందిలా బతుకు పోరు బరిలో నిలిచి నీకు నీవె ఆయుధమైతే ప్రతి పూట విజయ దశమియే వస్తుంది రా నీపై విధి విసిరె నిప్పుతో ఆడుకుంటె దీపావళి చెయ్ రా ప్రతి ఘడియ పండగే చెయ్ రా చెయ్ రా చెయ్ జీవితం అను రంగుల రాట్నమెక్కి ఊరేగరా జీవితం ఒక జాతర చెయ్యడానికే జన్మరా ఆ ఆ ఆ ఆ ఆ