2014

నీ జతగా

Nee Jathaga

🎬 Yevadu
Advertisement
నీ జతగా నేనుండాలి నీ యెదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి నాకే తెలియని నను చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నను రప్పించావే నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్ధం మార్చి నేనంటే నువ్వనిపించావే నీ జతగా నేనుండాలి నీ యెదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి
Advertisement

కాళ్లోకొస్తావనుకున్నా తెల్లార్లు చూస్తూ కూర్చున్న రాలేదే జాడైన లేదే రెప్పలా బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా పాడుకోవేం పైగా తిడతావేం లోకంలో లేనట్టి మైకంలో నేనుంటే వదిలేస్తావా నన్నిలా నీ లోకం నాకంటే ఇంకేదో ఉందంటే నమ్మే మాటలా నీ జతగా నేనుండాలి నీ యెదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి
తెలిసి తెలియక వాలింది నీ నడుంఒంపుల్లో నలిగింది నా చూపు ఎం చేస్తాం చెప్పు తోచని తొందర పుడుతుంది తెగ తుంటరిగా నను నెడుతుంది నీ వైపు నీదే ఆ తప్పు నువ్వంటే నువ్వంటూ ఏవేవో అనుకుంటూ విడిగా ఉండలేముగా దూరంగా పొమ్మంటూ దూరాన్ని తరిమేస్తూ ఒకటవ్వాలిగా నీ జతగా నేనుండాలి నీ యెదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి