మనిషి పుట్టినాక పుట్టింది మతము
పుట్టి ఆ మనిషినే వెనక నెట్టింది మతము
తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి
తలచకురా ఏ చెడ్డ గతము
Advertisement
నారాజు గాకుర మా అన్నయా
నజీరు అన్నయా
ముద్దుల కన్నయా
హొయ్ మనరోజు మనకుంది మన్నయా
నారాజు గాకుర మా అన్నయా
నజీరు అన్నయా
ముద్దుల కన్నయా
హొయ్ మనరోజు మనకుంది మన్నయో
అనువు కాని చోట
నువ్ అధికుడన్న మాట
అనవద్దు నంట నన్న
వేమన్న గారి మాట
వినలేద నువ్వు బేట
బంగారు పలుకు మాట
హెయ్ నారాజు గాకుర మా అన్నయా
నజీరు అన్నయా
ముద్దుల కన్నయా
హొయ్ మనరోజు మనకుంది మన్నయో
అక్కన్నలు మాదన్నలు
తానీషా మంత్రులుగా
ఉన్ననాడే రామదాసు
రాముని గుడి కట్టెనుగా
కులీ కుతుబ్ షాహీ ప్రేమ
ప్రేయసికి చిహ్నంగా
భాగమతి పేర
భాగ్యనగరము నిర్మించెనుగా
నవాబులు నిర్మించిన నగరములంటూ
నవాబులు నిర్మించిన నగరములంటూ
కులమతాల గొడవలు మనకెందుకురన్న
ఇంకెందుకురన్న
హెయ్ నారాజు గాకుర మా అన్నయా
నజీరు అన్నయా
ముద్దుల కన్నయా
హెయ్ మనరోజు మనకుంది మన్నయా
విన్నావా సోదరుడా
మొన్న నిమ్స్ దవాఖానలో
జరిగినట్టి సంఘటన
మానవతకు మచ్చు తునక
తన చావుకి ముస్లిము
మన హిందూ సోదరులకి
ప్రాణదానమిచ్చిండు
తన కిడ్నీలను తీసి
మనుషులంత ఒక్కటని శాస్త్రమన్న
మనుషులంత ఒక్కటని శాస్త్రమన్న
మనుషుల్లో సైతాన్లకు పట్టదన్న
ఇది పట్టదన్న
హెయ్ నారాజు గాకుర మా అన్నయా
నజీరు అన్నయా
ముద్దుల కన్నయా
హొయ్ మనరోజు మనకుంది మన్నయా
పీర్ల పండగ ఒచ్చిందా ఊర్లల్లో మనవాళ్ళు
డప్పుల దరువేసుకుంటూ కోలాటాలు ఆడుతారు
సదరు పండగ ఒచ్చిందా పట్నంలో ప్రతివారు
దున్నపోతులాడిస్తూ దిల్ ఖుషీలు చేస్తుంటరు
ఎవడేమి అంటే మనకేమిటన్నా
ఎవడేమి అంటే మనకేమిటన్నా
జాషువా విశ్వనరుడు నువ్వేరన్నా
ఎప్పుడు నువ్వేరన్నా
హెయ్ నారాజు గాకుర మా అన్నయా
నజీరు అన్నయా
ముద్దుల కన్నయా
హొయ్ మనరోజు మనకుంది మన్నయా
నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుని
గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని
నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుని
గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని
తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు
మన దీపాలు ఆర్పేస్తాడమ్మో నాయకుడు
తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు
మన దీపాలు ఆర్పేస్తాడమ్మో నాయకుడు
మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు
మా ధర్మం భేష్ అంటాడమ్మో నాయకుడు
మా గుడిలో మొక్కంటాడమ్మో నాయకుడు
మా ప్రార్థన చేయంటాడమ్మో నాయకుడు
దేవుళ్లనడ్డంగా పెట్టి నాయకుడు
దేవునిలా దోచేస్తాడమ్మో నాయకుడు
అధికారం తన పదవి కొరకు నాయకుడు
మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు
మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు
మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు
మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు
మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు