Advertisement
వెలుగారునా
నిశిపూసినా
వెలివేసినా
మది వీడునా
Advertisement
గుండె కన్నుమూసిన
విధి రాసిన కల
కాలిపోవు నిజమైన
నిన్ను వదలకుమా
వదలకుమా
బెదురెరుగని బలమా
నదివే నువ్వు నదివే
నీ మార్పే రానుంది వినవే
నదివే నువ్వు నదివే
నీకే నువ్వియ్యాలి విలువే
సిలువ బరువేమోయకా
సులువు భవి తెలీదుగా
వెన్నెల వలదను కలువవు
నువ్వు కావా కాలేవా
తడువు గురుతులై ఇలా
తరుము గతమునావనా
ఎటు కదలనీ నిమిషం
నులిమిన గొంతుకవా
నటనిక చాలనే
ఎద మోసినా
కొన ఊపిరున్న చైతన్యం
నువ్వు వదలకుమా
వదలకుమా
సరికోరే నిజమా
నదివే నువ్వు నదివే
నీ మార్పే రానుంది వినవే
నదివే నువ్వు నదివే
నీకే నువ్వియ్యాలి విలువే
మునుముందే వెలుగుంది
నిన్నల్లో నిశి దాగున్న
మునుముందే వెలుగుంది
దారే ముసుగుపోతున్న
మునుముందే వెలుగుంది
ఆగద్దు ఏదేమైనా
మునుముందే వెలుగుంది
దాటై ఆటు పోటైనా
మునుముందే వెలుగుంది
కలలే విడొద్దంటున్న
మునుముందే వెలుగుంది
తెలుపేగా హరివిల్లైనా
మునుముందే వెలుగుంది
ఉనికిని మరువద్దంటున్న
మునుముందే వెలుగుంది
నీ వెలుగై నేనొస్తున్నా
నదివే