2022

నాటు నాటు

Naatu naatu

🎬 RRR
Advertisement
పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
Advertisement

కిర్రు సెప్పులేసుకుని కర్రసాము సేసినట్టు మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు
నా పాట సూడు నా పాట సూడు నా పాట సూడు నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు పచ్చి మిరప లాగ పిచ్చ నాటు నాటు నాటు నాటు విచ్చు కత్తి లాగ వెర్రి నాటు
గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు సెవులు సిల్లు పడేలా కీసు పిట్ట కూసినట్టు ఏలు సిటికెలేసేలా యవ్వారం సాగినట్టు కాలు సిందు తొక్కేలా దుమారం రేగినట్టు ఒల్లు సెమటపట్టేలా వీరంగం సేసినట్టు
నా పాట సూడు నా పాట సూడు నా పాట సూడు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు గడ్డపార లాగ చెడ్డ నాటు నాటు నాటు ఉక్కపోత లాగ తిక్క నాటు
భూమి దద్దరిల్లేలా వొంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా ఏసేయరో యకాయకి నాటు నాటు నాటో దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా దుముకు దుముకులాడేలా దూకేయరో సరాసరి నాటు నాటు నాటో
హే అది డా నాకరా డా నాకరా డా నాకరా నాకరా నాకరా నాకరా నాకరా నాకరా నాకరా