2003

నాలో నువ్వొక సగమై

Naalo Nuvokasagamai

🎬 Johnny
Advertisement
నాలో నువ్వొక సగమై నేనొక సగమై చెరొక సగమై నిలిచే ఇలా ఒకరికొకరై ఒకే ఒకరై చివరి వరకు కలిసే
Advertisement

కలసిన మనసుల బంధం పెళ్లి కమనీయం ఈ పెళ్లి ఒక మాటగా ఒక బాటగా ఒక గూటికి పయనం పెళ్లి
నాలో నువ్వొక సగమై నేనొక సగమై చెరొక సగమై నిలిచే ఇలా ఒకరికొకరై ఒకే ఒకరై చివరి వరకు కలిసే
ప్రతీ చూపు నీ వైపే ప్రతీ అడుగు నీ జతలోనే ప్రతీ నవ్వు నీతోనే ప్రతీ జన్మ నీ ఒడిలోనే
బ్రతుకంత నీకే సొంతమే ఆ చితికైనా నీతో సిద్ధమే
అని పలికిన మంత్రం పెళ్లి అనురాగం వెదజల్లి అక్షింతలే సాక్షాలుగా వర్షించిన మేఘం పెళ్లి
నాలో నువ్వొక సగమై నేనొక సగమై చెరొక సగమై నిలిచే ఇలా ఒకరికొకరై ఒకే ఒకరై చివరివరకు కలిసే హే
నువ్వేనంట నా నేస్తం నువ్వేనంట నమ్మిన దైవం నువ్వేనంట ఆధారం నువ్వేనంట ఆశల తీరం
నాకంటే ఇష్టం నువ్వని ఆ నీ కష్టనష్టం నాదని
వివరించిన సూత్రం పెళ్లి విధికైనా ఎదురెళ్లి నా ప్రాణమే నీ ప్రాణమై వెలిగించే దీపం పెళ్లి