Advertisement
నా కంటి మీద కునుకే ఎగిరొచ్చినది వెనకే
ఒక ముద్దుతో గలాట పెట్టినావు గనకే
Advertisement
నా కంటి మీద కునుకే ఎగిరొచ్చినది వెనకే
ఒక్క ముద్దుతో గల లాట పెట్టినావు గనకే
నచ్చినావు కళ్ళకే నన్ను ఆశపెట్టి అల్లకే
నేల మీద ఇంత అందంగా పుట్టినావు ఎందుకే
నీ మాటే సరిగమా నీ వెంటే స్వర్గమా
నా చెయ్యే నీ చెయితో జట్టు కట్టమన్నదే
చుక్కల మాలికవా చక్కని పోలికవా
మనసే నాది చప్పుడు నీదమ్మా
చిక్కుడు గింజల దుక్కుల మద్దలమోత బాగుందే
అందులోన చెప్పలేని తొందరేదో ఆకట్టుకుందే
నీ ఎర్రటి బుగ్గల మాటల సిగ్గుల దీవి బాగుందే
అమ్మ కుట్టి అమ్మ కుట్టి కన్ను కొట్టి రమ్మంటుందే
కదిలే ఒంపుల తార నడుమే కొబ్బరి బూర
నువ్వు నడిచొచ్చిన మేరా సుమారుగా దుమ్మెత్తిపోదా
మెరిసే కాసుల పేరా ఒరిసే ఇక్కిలి పేరా
మెల్లగా పక్కన చేరా ఊసులు చెప్పమ్మా
రాతిరేలకే నవ్వులతోటి రంగులు పూసావే
వాలు చూపుతో వెన్నెల తెచ్చావే ఓ పిల్లా
మాపట్టేలకే మాటలతోటి మత్తును జల్లావే
ఇంగి అంచులో మంచం వేసావే
ఎక్కువకి తక్కువకి తక్కెడనువ్వమ్మా
చెక్కిలిలో చక్కెరని లెక్క పెట్టే తరమా
చుక్కల మాలికవా చక్కని పోలికవా
మనసే నాది చప్పుడు నీదమ్మా
చిక్కుడు గింజల దుక్కుల మద్దలమోత బాగుందే
అందులోన చెప్పలేని తొందరేదో ఆకట్టుకుందే
నీ ఎర్రటి బుగ్గల మాటల సిగ్గుల దీవి బాగుందే
అమ్మ కుట్టి అమ్మ కుట్టి కన్ను కొట్టి రమ్మంటుందే