2008

మై హార్ట్ ఈజ్ బీటింగ్

My Heart is Beating

🎬 Jalsa
Advertisement
మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ
Advertisement

పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి కనులలో వెతికితే దొరుకుతుందీ
టీ స్పూన్ టన్ను బరువవుతుందే ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే క్లౌడ్ 9 కాళ్ళకిందకొచ్చిందే లాండ్ మైన్ గుండెలో పేలిందే దే దే
మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ
Hey i wanna be with u forever Hey i wanna live with u forever
పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా మునుపు లేని మైకానా మదిని ముంచి పోయిందా
ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా తలగడతో తలబడుతూ తెల్లార్లు ఒంటరిగా వేగాలా
సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే స్టెన్ గన్ మోగినట్టు ఉంటుందే క్రాంప్టన్ ఫాను గాలి వీస్తుంటే సైక్లోన్ తాకినట్టు ఉంటుందే దే దే
మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ
ఎప్పుడెలా తెగిస్తానో నా మీదే నాకు అనుమానం మాటల్లో పైకనేస్తానో నీ మీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే పదపదమని పడుచు రథం ఎదలయలో ముదిరినదే మదనుడి చిలిపి రిథం
గుసగుసగా పిలిచినదే మనసున మెరిసిన కలలవనం తహతహగా తరిమినదే దం అరె దం అని తూలే ఆనందం
ఫ్రీడం దొరికినట్టు గాలుల్లో వెల్ కం పిలుపు వినిపిస్తుందే బాణం వేసినట్టు ఏ విల్లో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే దే దే
మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ