2026

మంగ మంగ

Manga Manga

🎬 Srinivasa Mangapuram
Advertisement
ఏ మంగా హే మంగా దేవతవే కచ్చితంగా ఏ లోకం నుండి ఊడి పడ్డావే ఏ మంగా హే మంగా శీనునే కరుణించంగా ఈ ఏడు కొండలు చేరి ఉంటావే
Advertisement

ముక్కే మూసేసుకొని బక్క చిక్కేలా నేను మొక్కులెన్నో మొక్కి ఉంటానే రెక్క కట్టేసుకొని చుక్క చక్కంగా వచ్చి చుట్టు వెలుగులిట్ట నింపావే
గుంపులో గోవిందయ్యను కాదే గుండెలో నిన్నే నింపేసుకున్నానే నా కోసం నువ్వు పుట్టేసావే నువ్వే లేకుంటే ఒక్కన్నే సచ్చిపోనమ్మో...
ఏ మంగా చూసే కళ్ళే నావే మంగా నవ్వే పళ్ళే నావే మంగ మొత్తం ఒళ్ళే నాదే దాచేసుకుంటానే
ఏ మంగ గుండె కొట్టిస్తానే పొర్లు దండాలు పెట్టేస్తానే మంగా నీకై పస్తుంటానే ప్రేమిస్తున్నానే
ఏ నువ్వెల్లే ప్రతి దారి పిలుస్తోంది ఈ గాలుల్లో నీ ప్రతి శ్వాస తెలుస్తోందే మనసే ఉంటే నా మనసున గుణమే నీకు వినిపిస్తుందే ప్రేమే ఉంటే నీ చుట్టూ తిరిగేటి నా ప్రేమే నీకు కనిపిస్తుందే
మంగా కళ్ళే నొక్కేస్తానే మంగా గొళ్ళే సవరిస్తానే మంగ ముద్దులు పెట్టేస్తానే నిమిషం కోసారే మంగ నన్ను తీసేయ్యద్దే మంగ నన్ను తోసెయ్యద్దే మంగా ఆశలు కోసెయ్యద్దే వస్తా ప్రతిసారే
హే మంగా హే మంగా నీ చేత్తో కమ్మంగా ఆ గోరు ముద్దలు ఎప్పుడు పెడ్తావే హే మంగా హే మంగా నా ఒళ్ళో క్షేమంగా ఓ ముద్దు ముచ్చటలెప్పుడు చెప్తావే
నువ్వే ఒప్పేసుకుంటే పెళ్ళే చేసేసుకుంటే ఏకంగా గుడి కట్టించేస్తానే పుట్టే పిల్లాడికేమో వెంకటేశులు పేరే పెట్టి గారబంగా పెంచేసుకుంటానే...
నువ్వే నేనని మనసే నీదని ఓ క్షణమే నువ్వు చెప్తే చాలమ్మో ఎవరేమైనా ఏదేమైనా ఉంటా నేనుంటా నీతోనే ఉంటానే చివారంటా
ఏ మంగా చూసే కళ్ళే నావే మంగా నవ్వే పళ్ళే నావే మంగ మొత్తం ఒళ్ళే నాదే దాచేసుకుంటానే
ఏ మంగ గుండె కొట్టిస్తానే పొర్లు దండాలు పెట్టేస్తానే మంగా నీకై పస్తుంటానే ప్రేమిస్తున్నానే...