2026

మండాడి మండాడి

Mandaadi Mandaadi

🎬 Mandaadi
Advertisement
పగలే తేగ రగిలే ఇక రణమే అనివార్యం ఎదురున్నది ఎవడెన్నడు చవిచూడని కార్యం కడతేర్చెడి కరవాలము కరికాలుడి సైన్యం పలు వాసన చిరు శ్వాసకి మండాడే ధైర్యం… ధైర్యం… ధైర్యం… కడలి పడవల ఆటల్లో పులిలా దూకెడి చరిత పుటల్లో వెలుగులు ఎరుగని చీకట్లో నిప్పై నిలబడె రా… కడగళ్ళ పాలిట సుడిగాలై మిసిమె తరిమెడి రవి కిరణాలై నవయుగ డమరుగ నాదల్లా లయతో తలపడె రా…
Advertisement

ప్రత్యర్ధుల మరణ భయం ఆ గగనమే అదరగా అలలపై అడుగిడ మునుముందుక మొదలు రణంతన రాకతో బానిస సంకెళ్ళ తెగిపడ కడలికి మల్లె ఎగసి ఎగసి పడతడు ఎవడికి వీడు అణిగి మణిగి బతకడు ప్రళయమే తల వంచుతాడి అవతొడు పగవాడి నిదురలో కలవర పెడుతాడు ఢీ… విశ్వం వణకాలి తిరుగీ… చేస్తే నువ్వు దాడి ఓ… మెరుపై సాగాలి సాహో… సాహో మండాడి ఢీ… విశ్వం వణకాలి తిరుగీ… చేస్తే నువ్వు దాడి ఓ… మెరుపై సాగాలి సాహో… సాహో మండాడి
ఓ కడలి రాజా పడవలు పిలిచెను రా మృదువుగా మోపిన పాదము తడిమిన అలలిక ముత్యాలయ్యే రా… ఓ వీరా పొరలోనే ఒదిగిన ఖడ్గం ఉప్పు గాలికి ముదిరిన చర్మం ఆ రేడిని పగటిగ మార్చే మాయ గడియారం నన్ను కాపలా కాసే గాలి సంద్రం అంతే… నా దైవం దైవం అలలెక్కిన పడవే రా నా ధైర్యం… నా గర్వం సర్వం
మండాడి మండాడి… హే… పడవదళం చిందాడితే మెరుపులే మండాడి మండాడి… ఎగబడే అలలకి గగనమే తెగిపడె మండాడి మండాడి… హే… పడవదళం చిందాడితే మెరుపులే మండాడి మండాడి… ఎగబడే అలలకి గగనమే తెగిపడె
మండాడి… మండాడి… మండాడి… మండాడి మండాడి… హే… మండాడి… మండాడి… మండాడి… మండాడి మండాడి…
వీరాధి వీరా మొదలయ్యెను సమరం సాకులు చెప్పక నువ్విక తప్పక తీర్చుకో పుట్టిన గడ్డ రుణం ఈ క్షణమే… కలకల కలకల సంద్రం సాక్షిగా గణగణ గుండెల శబ్దం సాక్షిగా ఢమఢమ ఢమఢమ రణమున గెలుపుల డంకా మోగిద్దాం కథ మారుద్దాం గెలిచే వద్దాం తెంచేద్దాం బతుకుల బేడి చరితని తిరగేద్దాం పదరా… రారా రా మండాడి
మండాడి మండాడి… హే… పడవదళం చిందాడితే మెరుపులే మండాడి మండాడి… ఎగబడే అలలకి గగనమే తెగిపడె మండాడి మండాడి… హే… పడవదళం చిందాడితే మెరుపులే మండాడి మండాడి… ఎగబడే అలలకి గగనమే తెగిపడె
మండాడి… మండాడి… మండాడి… మండాడి మండాడి… హే… మండాడి… మండాడి… మండాడి… మండాడి మండాడి…