Advertisement
మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం
చెప్పలేని ఏదో భావం నాలో కలిగెలె
సంద్రపు అలాలే పొంగి తీరం తాకే వేళా
మునిగే మనసు అసలు బెదరలేదులే
ఉన్నదీ ఒక మనసు వినదది నా ఊసు
నను విడి వెళ్లిపోవుట నేను చూసానే
తియ్యని స్వప్నం ఇది చెరగని మనో నిధి
కలలో కలలో నను నేనే చూసానే
నాకేం కావలి నేడు ఒక మాట అడిగి చూడు
ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెపుడు
నాకేం కావలి నేడు ఒక మాట అడిగి చూడు
ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెపుడు
Advertisement
దోసిట పూలు తెచ్చి ముంగిట ముగ్గులేసి
మనసును అర్పించగా ఆశ పడ్డానే
వలదని ఆపు నది లేదని అడిగే మాది
నదిలో ఆకు వాలే కొట్టుకుపోయానే
గరికెలు విరులయ్యే మార్పే అందం
ఎన్నో యుగములుగా వెలిగిన బంధం
ఒక వెండి గొలుసు వోలె ఈ మనసు ఊగేనిపుడు
తొడగాలి వజ్రమల్లె నే మెరియుచుంటి నిపుడు
ఒక వెండి గొలుసు వోలె ఈ మనసు ఊగేనిపుడు
తొడగాలి వజ్రమల్లె నే మెరియుచుంటి నిపుడు
మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం
చెప్పలేని ఏదో భావం నాలో కలిగెలె
సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళా
మునిగే మనసు అసలు బెదరలేదులే
ఉన్నదీ ఒక మనసు వినదది నా ఊసు
నను విడి వెళ్లిపోవుట నేను చూసానే
తియ్యని స్వప్నం ఇది చెరగని మనో నిధి
కలలో కలలో నను నేనే చూసానే
ఒక వెండి గొలుసు వోలె ఈ మనసు ఊగేనిపుడు
తొడగాలి వజ్రమల్లె నే మెరియుచుంటి నిపుడు