2021

మగువ మగువ

Maguva Maguva

🎬 Vakeel Saab
Advertisement
మగువ మగువ లోకానికి తెలుసా నీ విలువా మగువ మగువ నీ సహనానికి సరిహుద్దులు కలవా
Advertisement

అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయటా అలుపని రవ్వంత అననే అనవంటా వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా
మగువ మగువ లోకానికి తెలుసా నీ విలువా మగువ మగువ నీ సహనానికి సరిహుద్దులు కలవా
నీ కాటుకు కనులు విప్పారాకపోతే ఈ భూమికి తెలవరదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా
ప్రతి వరుసలోను ప్రేమ గ అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమ అంచనాలకందునా ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునా
నీదగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడేగా
ఎందరి పెదవులొల ఏ చిరునవున్న ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా
మగువ మగువ లోకానికి తెలుసా నీ విలువా మగువ మగువ నీ సహనానికి సరిహుద్దులు కలవా