2021

కంటిపాపా

Kanti Paapaa

🎬 Vakeel Saab
Advertisement
కంటిపాపా కంటిపాపా చెప్పనైన లేదే నువ్వంతలా అలా ఎన్ని కలలు కన్నా కాలి మువ్వా కాలి మువ్వా సవ్వడైనా లేదే నువ్విన్నినాళ్ళుగా వెంట తిరుగుతున్నా
Advertisement

నీరాక ఏరువాక నీ చూపే ప్రేమలేఖ నీలో నువ్వాగిపోకా కలిసావే కాంతి రేఖ అంతులేని ప్రేమ నువ్వై ఇంత దూరం వచ్చినాక అందమైనా భారమంతా నాకు పంచినాకా
మొదలేగా కొత్తకొత్త కథలు మొదలేగా కొత్తకొత్త కలలు ఇకపైనా నువ్వు నేను బదులు మనమన్నా కొత్తమాట మొదలు
కంటిపాపా కంటిపాపా చెప్పనైన లేదే నువ్వంతలా అలా ఎన్ని కలలు కన్నా
సాపమాప మాప మాగసామగరిసా సాపమాప మాప మాగసామగరిసా
సుదతీ సుమలోచినీ సుమనోహర హాసిని రమణీ ప్రియ భాషిణీ కరుణాగున భాసిని మనసైన వాడిని మనువాడిన ఆమని బదులీయవే చెలీ నువు పొందిన ప్రేమనీ పండంటి ప్రాణాన్ని కనవే కానుకగా
సాపమాప మాప మాగసామగరిసా సాపమాప మాప మాగసామగరిసా
ఎదలో ఏకాంతము ఏమయ్యిందో ఏమిటో ఇదిగో నీ రాకతో వెళిపోయింది ఎటో నాలో మరో నన్ను చూశా నీకో స్నేహితుణ్ని చేశా కాలం కాగితాలపై జంట పేర్లుగా నిన్ను నన్ను రాసా
ఆకాశం గొడుగు నీడ పుడమేగా పూల మేడ ఏ చూపులు వాలకుండా ప్రేమే మన కోటగోడ నాకు నువ్వై నీకు నేనై ఏ క్షణాన్ని వదలకుండా గురుతులెన్నో పెంచుకుందాం గుండె చోటు నిండా
మొదలేగా కొత్తకొత్త కథలు మొదలేగా కొత్తకొత్త కలలు ఇకపైనా నువ్వు నేను బదులు మనమన్నా కొత్తమాట మొదలు
మొదలేగా కొత్తకొత్త కథలు మొదలేగా కొత్తకొత్త కలలు ఇకపైనా నువ్వు నేను బదులు మనమన్నా కొత్తమాట మొదలు